పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో పూర్తిగా సినిమాలకు స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఆ తరువాత తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమైన పవన్, అంతకముందు కొద్దిరోజులుగా తనకు వెన్ను నొప్పి బాధిస్తున్నప్పటికీ, ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో వెన్ను నొప్పి బాధకు తాత్కాలిక పెయిన్ కిల్లర్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రోజులు గడవడంతో మెల్లగా ఆ నొప్పి బాధించడం మరింత ఎక్కువ అయిందని, 

అందువలన కొద్దిరోజులుగా తాను పార్టీ కార్యకలాపాల్లో కూడా పాల్గొనలేకపోతున్నాను అని పవన్ ఒక ప్రకటన కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వెన్ను నొప్పి ప్రస్తుతం మరింత తీవ్రం అవడంతో పవన్ కు శస్త్ర చికిత్స అవసరం అని చెప్పారట వైద్యులు. శస్త్ర చికిత్స చేయించుకుంటే వెన్ను నొప్పి బాధ చాలావరకు తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో, ఆ విషయాన్ని తన కుటుంబసభ్యులు మరియు సన్నిహితులతో చర్చించిన పవన్, శస్త్ర చికిత్సకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి వైద్య చికిత్సని తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం రేపటి నుండి ఆ చికిత్స ప్రారంభం అవుతుందని, దాని కారణంగా కొన్నాళ్లపాటు పవన్ ఎవ్వరికీ కూడా అందుబాటులో ఉండరని అంటున్నారు జనసేన పార్టీ నేతలు. 

చికిత్స సమయంలో ఆయనకు పూర్తిగా విశ్రాంతి అవసరమని భావించే, పవన్ కూడా తన కార్యక్రమాలు అన్నిటినీ కొన్నాళ్లపాటు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే గత కొద్దిరోజులుగా పవన్ సర్జరీకి ఉపక్రమిస్తున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ, సర్జరీ కంటే మేలైన ప్రకృతి వైద్య విధానాన్ని ఎంచుకున్న పవన్ కు అతి త్వరగా వెన్ను నొప్పి బాధ తగ్గి, మళ్ళి ప్రజాక్షేత్రంలోని రావాలని కోరుకుంటూ పలువురు పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో గెట్ వెల్ సూన్ పవన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: