జల్లికట్టు.. తమిళ ప్రజలకు ఎంతో ఇష్టమైన ఆట. ఈ ఆటను బ్యాన్ చేయాలని ఢిల్లీ స్థాయిలో రక రకాల ప్లాన్స్ నడుస్తున్నా తమిళ ప్రజలు మాత్రం ఇది మా సంప్రదాయ ఆట.. ఈ ఆటను బ్యాన్ చేస్తే సహించం! అంటూ కేంద్రానికే ఆల్టిమేటమ్ జారీ చేశారు. ఈ దెబ్బతోనే జల్లికట్టు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడిదే  పేరుతో ఓ థ్రిల్లర్ సినిమాని మలయాళ దర్శకుడు లిజ్జో జోస్ పెల్లి సెరి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ని చూస్తుంటే పూర్తిగా డార్క్లో తీసిన సినిమా అని అర్థమవుతోంది. నైట్ ఎఫెక్ట్ లో కంప్లీట్ గా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో గగుర్పొడిచే ఎలిమెంట్ తో ఈ సినిమాని తీస్తున్నారని తెలుస్తోంది. ఎంతో ఉత్కంఠతతో వున్న ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

అక్టోబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా జాతీయ స్థాయిలో అన్ని రకాలుగా అటెన్షన్ ని క్రియేట్ చేసి హైలెట్ అవుతోంది. అడవిలో.. తోటల్లో గేదె ఊరి వాళ్ల నుంచి తప్పించుకుంటూ హల్ చల్ చేస్తుంటుంది. ఈ క్రమంలో హత్యలు జరిగిపోతుంటాయి. పంట పొలాల్ని నాశనం చేస్తూ ఊరి జనాలకు నిద్ర లేకుండా నరకం చూపిస్తుంటుంది. దాంతో ఆ ఊళ్ళో వున్న ప్రతీ వ్యక్తి  ఆ గేదెను చంపాలని తిరుగుతుంటారు. ఆ క్రమంలో యువకులని ఆ గేదె చంపేస్తుంటుంది. మనిషి మాంసాన్ని రుచి మరిగిన ఆ గేదె సమస్య నుంచి ఆ గ్రామం ఎలా బయటపడింది? అన్నది ఆసక్తిని పెంచుతోంది. అయితే ట్రైలర్ చివరిలో జాంబీ తరహా మనిషి మాంసం రుచి ఎరిగిన అడవి మనుషుల్ని ఇందులో చూపిస్తుండడంతో సినిమా మీద మరింత ఉత్కంఠత పెరుగుతోంది.

ఈ ప్రపంచంలో అత్యంత రుచికరమైన మాంసం ఎవరిది అంటే మనిషిది.. అంటూ ట్రైలర్లో వినిపిస్తున్న డైలాగ్ లు వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పబోతున్నాడో ఆ డైలాగ్ తో స్పష్టమవుతోంది. ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమా.. విడుదల తరువాత ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. డార్క్ నైట్ లో చిత్రీకరించిన సన్నివేశాల్ని.. అందులో వున్న ఇంటెన్సిటీని చూసిన వాళ్ళంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియోటర్స్ లోకి వస్తుందా..ఎన్ని కాంట్రవర్సీలకు కేంద్ర బిందువు అవుతుందా అని ఆసక్తిని చూపిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: