మెగాస్టార్ చిరంజీవి మరియు నయనతారల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే స్వతంత్ర సమరయోధుడు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్ని అందించగా, జూలియస్ పాకీయం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించడం జరిగింది. ఇక ఈ సినిమాలోని సైరా అనే పల్లవితో సాగె సాంగ్ ఫుల్ వీడియోని నేడు రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ సాంగ్ లో విజువల్స్ ని బట్టి చూస్తుంటే సినిమా ఎంతో అదిరిపోయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ టాక్ నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల ద్వారా బయటకు రావడం జరిగింది. 

అయితే బయటకు వచ్చిన ఆ వార్తను బట్టి, సినిమా మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో మొదలవుతుందని, అలానే అనుష్క వీర నారి ఝాన్సీ లక్ష్మి బాయి పాత్రలో మొదట్లో కొన్ని నిముషాలు కనపడి, ఆమె నరసింహారెడ్డిని గురించి పరిచయం చేయడం జరుగుతుందని అంటున్నారు. ఇక మెగాస్టార్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోతుందని, అలానే తమన్నా ఫస్ట్ హాఫ్ లో తన నటనతో మంచి మార్కులు సంపాదిస్తుందని అంటున్నారు. మొదటి భాగంలో ఒకింత యాక్షన్ సీన్స్ తక్కువని, అయితే ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ గా వచ్చే అండర్ వాటర్ ఫైట్ అదిరిపోతుందని అంటున్నారు. ఇక ఆ తరువాత మొదలయ్యే సెకండ్ హాఫ్ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుందని అంటున్నారు. మధ్యలో కొంత నెమ్మదించినప్పటికీ మెల్లగా పుంజుకుని ముందుకు సాగుతుందని, 

అలానే ఆ సమయంలో వచ్చే కొన్ని ఫైట్ సీన్స్ ఎంతో బాగుంటాయని చెప్తున్నారు. ఇక ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ గా వచ్చే వార్ సీన్ అయితే ప్రేక్షకులకు కన్నులపండుగగా నిలవడం ఖాయం అని అంటున్నారు. ఇక క్లైమాక్స్ కూడా ఎంతో ఎమోషనల్ గా సాగుతుందని, క్లైమాక్స్ లో పవర్ స్టార్ తన వాయిస్ తో ఇరగతీసినట్లు చెప్తున్నారు. ఓవర్ ఆల్ గా ఒక మంచి హిట్ సినిమాకు కావలసిన అన్ని అంశాలు సైరా సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది. ఇక సినిమాలోని రెండు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్స్, యాక్షన్ సీన్స్, యుద్ధం సన్నివేశాలు, విజువల్స్ ఎంతో బాగున్నాయని టాక్. మరి ఈ టాక్ ని బట్టి చూస్తుంటే రేపు ప్రేక్షకుల ముందుకు రాబోయే సైరా మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: