టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. గతంలో త్రివిక్రమ్ మరియు బన్నీల కాంబినేషన్లో వచ్చిన జులాయి మరియు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి హిట్ సాధించడంతో, హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న దీనిపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇకపోతే నిన్న ఈ సినిమా నుండి సామజవరగమనా అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 

యువ సంగీత తరంగం ఎస్ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం జరిగింది. ఇక ఈ పాటకు మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ స్టైల్ ట్యూన్ ఇచ్చిన థమన్, యువ గాయకుడు సిద్ శ్రీరామ్ తో ఈ పాటను పాడించడం జరిగింది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారు రాసిన ఈపాటకు ప్రస్తుతం యువత విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. ఇక యూట్యూబ్ లో రిలీజ్ చేసిన దగ్గరినుండి నేటితో ఈ సాంగ్ అప్పుడే ఒక కోటికి పైగా వ్యూస్ తో దూసుకుపోతుండడంతో పాటు, ఇంకా యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండడం విశేషం. ఈ సాంగ్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పాలి. 

బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి టబు, అక్కినేని సుశాంత్, నవదీప్, రాహుల్ రామకృష్ణ, నివేత పేతురాజ్ తదితరులు ఇతర ముఖ పాత్రల్లో నటిస్తుండగా, పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. బన్నీ ఈ సినిమాలో ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవల అరవింద సమేత సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మంచి ఎంటర్టైనింగ్ గా కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: