మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇటీవల వచ్చిన బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. కొన్ని వందల కోట్ల భారీ ఖర్చుతో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా, మరొక బ్రిటిష్ యువతీ కూడా ఇటీవల ఈ సినిమాలో మరొక హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. 

ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, అలానే ఎన్టీఆర్ కొమరంభీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. వారిద్దరూ మంచి వయసులో ఉన్న ఉన్నపుడు ఏ విధంగా అప్పటి స్వతంత్ర పోరాటం పై ముందుకు సాగారు అనే అంశంపై సినిమా ఉండనున్నట్లు రాజమౌళి చిన్న హింట్ కూడా ఇచ్చారు. అయితే నేడు ఇదే విషయమై ఆ సినిమా కోసం మూడు పాటలు రాసిన ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమాలోని పాటల విషయమై తాను ఇప్పుడే మాట్లాడడం సరైనది కాదని, 

అయితే సినిమా గురించి తమకు రాజమౌళి గారు ఏమని చెప్పారో మాత్రం కొంత వివరించడం జరిగింది. అల్లూరి, కొమరం భీం, ఇద్దరూ కూడా యువకులుగా ఉన్న సమయంలో ఇంటినుండి బయటకు వచ్చేసి అనుకోకుండా కలవడంతో పాటు, అప్పటి స్వతంత్ర పోరాటానికి సంబంధించి ఏ విధంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచించారు అనేదానిపై కొంత కల్పిత కథను సృష్టించి, ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఎంతో అత్యద్భుతంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజమౌళి ఒక దృశ్య కావ్యంగా తెరకెక్కిస్తున్నారని, అటువంటి గొప్ప సినిమాకు తాను పాటలు రాయడం నిజంగా తన అదృష్టమని అన్నారు అశోక్ తేజ. ఇక అశోక్ తేజ గారి మాటలతో ఆర్ఆర్ఆర్ సినిమా ఏ విధంగా ఉండనుందో పూర్తిగా కాకపోయినా కొంత వరకు మాత్రం అర్ధమైంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: