‘సైరా’ విడుదలకు ఇక కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితులలో చిరంజీవి చరణ్ దృష్టి అంతా ‘సైరా’ రిజల్ట్ పైనే ఉంది. ఈ మూవీ ప్రమోషన్ ఎక్కడ జరిగినా చిరంజీవి తన కొడుకు చరణ్ సమర్థత గురించి మాట్లాడుతూ చరణ్ లేకుంటే ‘సైరా’ లేదనీ ఈ మూవీకి 300 కోట్ల భారీ బిజినెస్ జరగడం వెనుక చరణ్ వ్యూహాలు కీలకం అంటూ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు.

ఇలా ఒక్క క్షణం ఖాళీ లేకుండా ‘సైరా’ వ్యవహారాల పై బిజీగా ఉన్న రామ్ చరణ్ ఈ హడావిడి మధ్య ఒక మళయాళ పొలిటికల్ మూవీ రైట్స్ హడావిడిగా కొనడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసిఫర్’ మళయాళంలో సూపర్ హిట్. 

వాస్తవానికి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాల నిర్మాణ సంస్థలు ప్రయత్నించినా ఆ కథ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా అన్న సందేహంతో వెనకడుగు వేసారు. దీనికి కారణం ఈ మూవీలో ఎటువంటి ఎంటర్ టైన్మెంట్ ఉండదు. హ్యూమన్ ఎమోషన్లు, సీరియస్ ఫిక్చరైజేషన్ మాత్రమే వుంటుంది.

దీనితో ఈ సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ సమకూర్చడం కష్టం అన్న అభిప్రాయంతో ఈ మూవీ రీమేక్ గురించి తెలుగు దర్శక నిర్మాతలు ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు ఈ మూవీ రీ రైట్స్ ను చరణ్ కొనడంతో ఈ సినిమా పవన్ కళ్యాణ్ కోసం అంటూ ప్రచారం జరుగుతోంది. చిరంజీవి మార్కెట్ ను 300 కోట్ల స్థాయికి తీసుకువెళ్ళిన చరణ్ పవన్ కళ్యాణ్ మార్కెట్ ను కూడ పెంచడానికి తానే స్వయంగా నిర్మాతగా మారి పవన్ రీ ఎంట్రీ ఫిలిం ను గ్రాండ్ గా నిర్మిస్తాడు అన్న ఊహాగానాలు గత కొద్ది రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తు ఇప్పుడు చరణ్ ఈ మూవీ రైట్స్ కొనడంతో పవన్ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: