నటుడు రవి బాబు అల్లరి సినిమా తో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత దర్సకత్వం వహించిన సినిమాలు సరిగా ఆడలేదు. 2007 లో ఆయన దర్శకత్వం వహించిన అనసూయ సినిమా  మంచి విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన నచ్చావులే, అమరావతి,మనసారా సినిమాలు ఆయన కు దర్శకుడి గా మంచి పేరును తెచ్చాయి.ఈ మధ్య వచ్చిన ఆయన సినిమాలు సరిగా ఆడటం లేదు.

ప్రస్తుతం ఆవిరి అనే హారర్‌ సినిమా తో మన ముందుకు వస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి అందరిని ఆకట్టుకుంది . ఆ టీజర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ను కూడా చాలా బాగా ఆకట్టుకుంది..‘అన్ని చిత్రాల్లోకెల్లా హారర్‌ జానర్‌ సినిమాలు ఎక్కువుగా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి హారర్ మూవీస్ ను తీయడంలో రవిబాబు మాస్టర్‌’.. ‘ఆవిరి’ చిత్ర యూనిట్ కి, డైరెక్టర్ రవిబాబుకి ఆల్‌ ది బెస్ట్‌’ అని మహేష్ బాబు ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ చేశారు.ఒక ఇంట్లో మనుషులతో పాటుగా ఒక ఆత్మ ఉంటే ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. సినిమాటోగ్రఫీ  మరియు బ్యాక్ రౌండ్ మ్యూజిక్ రెండు చాలా బాగున్నాయి. ఒక మంచి హారర్ సినిమాకి ఇవి రెండు చాలా ముఖ్యం.  

ఆవిరి సినిమా దిల్ రాజు సమర్పణలో  వస్తుంది.  రవి బాబు  ఈ సినిమా  లో నటిస్తున్నారు,  నిర్నిస్తున్నారు, దర్శకత్వం వహిస్తున్నారు. నేహా    రవి బాబు,చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. , మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకి సుధాకర్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: