టాలీవుడ్ లో ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు బుల్లితెర టాప్ షో  జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న నటి,యాంకర్ అనసూయ.  యాంకర్ గా ఇప్పటికే మంచిపేరు తెచ్చుకుంది.  నటిగా మెప్పించే ప్రయత్నం చేస్తున్నది.  పైగా ఇద్దరు పిల్లలకు తల్లి.  అయినా గ్లామర్ షోకులు ఏ మాత్రం తగ్గడం లేదు.  జబర్దస్త్ షోలోనే అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటున్న అనసూయ సినిమా విషయంలో కూడా దాదాపుగా అలానే చేస్తున్నది.  


ఇక సమయం దొరికినపుడు ఫ్యామిలీతో కలిసి అలా బయటకు చెక్కేస్తోంది. ఇటీవలే అనసూయ అమెరికా ట్రిప్ కు వెళ్ళింది.  అక్కడికి వెళ్ళగానే మరేమయిందో తెలియదుగాని, సడన్ అందాలను ఆరబోసేందుకు సిద్ధం అయ్యింది.  చిన్న నిక్కర్ పైన ఒక టీ షర్ట్ వేసుకొని సముద్రం ఒడ్డున ఫోటోలు దిగింది.  సెలెబ్రెటీలకు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటే కదా... పాపం అలానే పోస్ట్ చేసింది.  


అలా ఆ ఫోటోలు పోస్ట్ అయ్యాయో లేదో లక్షలాది మంది ఫోటోలను చూశారు.  చూసి ఊరుకుంటే బాగుంటుంది.  కానీ, మనవాళ్ళు అలా కాదు కదా.  కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.  అమెరికాలో ఉన్న వాళ్ళు నిండుగా బట్టలు వేసుకొని ఉంటె, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి అవేం పనులు అంటూ విమర్శించడం మొదలుపెట్టారు.  ఇంకొందరైతే మరికొంచం ఘాటుగా విమర్శించారు.  


భయపడితే అనసూయ ఎందుకు అవుతుంది.  నెటిజన్ల రిప్లయ్ కు ఆమెసైతం అదే రేంజ్ లో రిప్లయ్ ఇచ్చింది అనుకోండి.  ఎందుకోమరి మనవాళ్ళు విదేశాలకు వెళ్ళిపోగానే బట్టల విషయంలో స్వేచ్ఛను ప్రకటిస్తారు.  చిన్న చిన్న డ్రెస్ లతో  దర్శనం ఇస్తుంటారు.  బహుశా అక్కడి వాతావరణం మహిమ కావొచ్చు.  లేదంటే అక్కడి ఎట్రాక్షన్ కావొచ్చు.  కారణం ఏదైనా సరే.. విషయం మాత్రం మారదు.  అది అసలు సంగతి.  


మరింత సమాచారం తెలుసుకోండి: