గత కొన్ని రోజులుగా టీవీలో సైరా ప్రచార చిత్రాలు ప్రసారం అవుతున్నాయి.  మనం ఎక్కడ ఉన్నా సరే టీవీలో సైరా ప్రచారం ప్లే అవుతుంది తెలుసుకోవడానికి ఒక మ్యూజిక్ కారణం అయ్యింది.  హో .... సైరా అనే మ్యూజిక్ ప్లే కావడం వలన ఓహో సైరా ప్రచారం జరుగుతున్నది.  ప్రస్తుతం టీవీలో అది ప్లే అవుతుంది అని తెలుస్తోంది.  సైరా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ప్రభావితం చేసింది. అమిత్ త్రివేది ఆకట్టుకునే విధంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రూపొందించారు. 

ఇక సాంగ్స్ సైతం సినిమాకు ప్లస్ అయ్యాయి.  మాములుగా ఇలాంటి చారిత్రాత్మక చిత్రానికి సాంగ్స్ బాగుంటాయి.  ఎక్కువగా గ్రాంధికంగా ఉంటాయి.  ఇందులోనూ అదే విధంగా ఉన్నా.. వినసొంపుగా ఉన్నాయి.  అమిత్ త్రివేది మ్యూజిక్.. సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన పదాలు సినిమాకు ప్లస్ ఆవుతాయి అనడంలో సందేహం అవసరం లేదు.  ఇప్పుడు సినిమాకు మరో ప్లస్ పాయింట్ కూడా ఉన్నది.  అదే పవన్ కళ్యాణ్ వాయిస్.  


ఇందులో పవన్ కళ్యాణ్ నటించకపోయినా.. సినిమాలో ఎండింగ్ లో పవన్ వాయిస్ వినిపిస్తుంది.  అదే సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు.  అంతేకాదు, సైరాలో ఎండింగ్ లో అనుష్క కనిపిస్తోంది. రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవిగా మెప్పించిన అనుష్క, ఇపుడు సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయిగా మెప్పించబోతున్నది.  సినిమాలో ఆమె వీరోచిత పోరాటాలు అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. 

ఈ రెండు పాయింట్లు కూడా సినిమాకు ప్లస్ కాబోతున్నాయి.  వీటితో పాటుగా మరిన్ని పాయింట్లు కూడా సినిమాకు ప్లస్ కాబోతున్నాయి.  65 సంవత్సరాల వయసులో కూడా మెగాస్టార్ ఈ స్థాయిలో కత్తిపట్టుకొని యుద్ధం చేశాడంటే మాములు విషయం కాదు.  ఇక గ్రాఫిక్స్ కూడా సినిమాలు ప్లస్ అవుతుందని అంటున్నారు.  ఇవి సినిమాకు అదనంగా ప్లస్ పాయింట్స్ అవుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: