మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా రేపు విడుదల కాబోతుంది. దాదాపు 285 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమాను తెరకెక్కించారు. 
 
సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి గెటప్పు, మేకప్పు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయో లేదో చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో జూనియర్ ఎన్టీయార్ శక్తి సినిమాలో ఇలాంటి గెటప్పుతోనే కనిపించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీయార్ గెటప్పు, మేకప్ పై దారుణమైన విమర్శలు వచ్చాయి. శక్తి సినిమా దారుణంగా పరాజయం పాలవటానికి ఎన్టీయార్ గెటప్పు, మేకప్ కూడా ఒక రకంగా కారణం అయ్యాయి. 
 
చిరంజీ మేకప్, గెటప్పు టీజర్, ట్రైలర్లో బాగానే ఉన్నా ఫుల్ లెంగ్త్ సినిమాలో ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఎందుకంటే సైరా సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన సమయంలో చిరంజీవి గెటప్పుపై కొంత విమర్శలు వచ్చాయి. సైరా సినిమా టీజర్ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సెలవులు కావటంతో సైరా సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
కొన్ని రోజుల ముందు ఈ సినిమాపై అనేక వివాదాలు చుట్టుముట్టినా ప్రస్తుతం ఈ వివాదాన్ని సైరా యూనిట్ మరియు ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, అనుష్క ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించటం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: