తెలుగు సినీ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మహా నటుడు చిరంజీవి. మూడు తరాల వాళ్లకు తరగని సినీ సంపదని అందించిన ఆయన..     అలుపెరగని బాటసారి, ఉపిరి ఆగు వరకు జనం మధ్యలో బ్రతుకుతాను.. నా ఊపిరి నా అభిమానులు అనే మహానుభావుడు అంటే గుర్తొచ్చే వ్యక్తి  చిరంజీవి. ఇండస్ట్రీలో వారు లేకున్నా కూడా స్వయం కృషితో కష్టాన్ని నమ్ముకొని వచ్చిన ఏకైక వ్యక్తి చిరంజీవి. సాధారణ హీరో నుండి మెగా స్టార్ చిరంజీవిగా తన నటన ప్రస్థానాన్ని కొనసాగించిన వ్యక్తి ఈయన.. సినీ ఇండస్ట్రీలో ఏ వ్యక్తిని అడిగిన కూడా నాకు చిరంజీవి గారే స్ఫూర్తి అనే అంటారు అందంలో అతిశయోక్తి లేదు. 


సినిమాలు చేసి వారిని నవ్వించడం కన్నా, ప్రజల నాయకుడై ప్రజల్లో ఉండాలని అనుకున్న చిరు కొద్దీ రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు.. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. ఆ సినిమానే సైరా నరసింహ రెడ్డి.. చరిత్ర కారుడు ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. 



ఈ సినిమాకు తనయుడు రామ్ చరణ్ నిర్మాత బాధ్యతలు తీసుకున్నారు. చరణ్ దృవ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమా ప్రతి ఒక్క ఇండస్ట్రీలోని పెద్ద స్టార్లు నటిస్తున్నారు. బాలీవుడ్ నుండి బాలీవుడ్ బాద్షా బిగ్ బి అమితాబ్ బచ్చన్, తమిళ్ నుండి  నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా, జగపతి బాబు, సుదీప్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ కావడానికి కేవలం కొద్దీ గంటలు మాత్రమే  ఉంది. యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుండి




ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, ట్రైలర్స్ ను బట్టి ఈ సినిమా లో విడుదలైన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. అమిత్ త్రివేది అందించిన సంగీతం అందరిలో పోరాట తత్వాన్నినికి ఉరకలెత్తిస్తుంది. 
సైరా సినిమా హిట్ పక్క అని సినీ ఇండస్ట్రీ మొత్తం కోడై కూస్తుంది. గతంలో వచ్చిన బాహుబలి రికార్డులను ఈ సినిమా తుడిచి పెట్టేసింది అని వేరేలా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా మాములుగా జనాలను ఆకట్టుకోలేదు. సినిమా కు దర్శకత్వం వహించింది బాగా పండిన డైరెక్టర్ కాదు రెండో సినిమానే.. అలాంటి అతను సాధించింది మేము ఎందుకు చేయలేకున్నాము అని డైరెక్టర్లు ఆలోచనలో పడ్డారు. ఇక వారి సినిమా స్టైల్ మార్చుకుంటారని మెగా అభిమానులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: