మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన కెరీర్ 151 వ సినిమాగా తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. మెగాస్టార్ సరసన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, పలువురు ఇతర భాషల నటులు కూడా దీనిలో కొన్ని ముఖ్యపాత్రల్లో నటించారు. తొలి తరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్స్ మరియు సాంగ్స్, సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసాయి. 

అయితే ప్రేక్షకుల అంచనాలను రేపు రిలీజ్  అయ్యే తమ సినిమా తప్పకుండా అందుకుంటుందని అంటోంది సినిమాయూనిట్. భారీ యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన సెట్టింగ్స్ తో అత్యద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా, టాలీవుడ్ సినిమాల్లో హైయెస్ట్ కాస్ట్ తో తెరకెక్కిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఖర్చు దాదాపుగా రూ.250 నుండి రూ.300 కోట్ల వరకు అయినట్లు కొద్దిరోజలుగా వార్తలు వస్తున్నప్పటికీ, సినిమా యూనిట్ మాత్రం దీనిపై ఇప్పటివరకు ఎక్కడా కూడా అధికారికంగా మాత్రం ప్రకటించడం జరగలేదు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాలు మాత్రమే భారీ బడ్జెట్ తో తెరకెక్కడం జరిగింది. అయితే అవి ప్రేక్షకుల అంచనాలు అందుకుని నిర్మాతలకు మంచి లాభాలు తీసుకురావడం జరిగింది. 

అయితే సైరా విషయంలో ఎంత ఖర్చు అయింది అనే విషయాన్ని సినిమా యూనిట్ బయటకు వెల్లడించకపోవడం పై కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి సినిమాల మాదిరిగా ఈ సినిమాకు కూడా మంచి సక్సెస్ అయితే పర్లేదని, ఒకవేళ ఏ మాత్రం తేడా కొట్టినా, సినిమాను బోలెడు ఖర్చుపెట్టి తీసిన నిర్మాత చరణ్ తో పాటు దానిని కొనుగోలు చేసిన బయ్యర్లు కూడా భారీగా నష్టాలు చవిచూడవలసి వస్తుందని అంటున్నారు. అందువల్లనే ఈ సినిమా బడ్జెట్ బయటకు చెప్పడం లేదనే ఒక వాదన వినపడుతోంది. ఏది ఏమయినప్పటికీ, ఇప్పటివరకు వస్తున్న పలు రిపోర్ట్స్ ని బట్టి చూస్తుంటే, సైరా నరసింహారెడ్డి సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు సినీ విశ్లేషకులు.... !!


మరింత సమాచారం తెలుసుకోండి: