పదేళ్ల తర్వాత కూడా తన స్టామినా ఇసుకంత కూడా తగ్గలేదని ఖైది నంబర్ 150తో ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా హిట్ అవడంతో అంతకుమించిన ఎనర్జీతో ఈసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కిన సైరా సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు.       


ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించిన దాని కన్నా అసలు సినిమాలో ఎక్కువ ఉంటుందని. అది వెండి తెర మీద చూపించి సర్ ప్రైజ్ అవ్వడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు బాహుబలి లాంటి సినిమా అయినా కూడా లాస్ట్ మంత్ రిలీజ్ అయిన సాహో సినిమా భారీ ప్రమోషన్స్ చేయడం వల్ల అంచనాలు కూడా అదే రేంజ్ లో పెరిగాయి.


అయితే సినిమా స్థాయిలో లేకపోవడం వల్ల ఆడియెన్స్ పెదవి విరిచారు. అందుకే సైరా కంటెంట్ బాగున్నా థియేటర్ లో ఆడియెన్స్ సర్ ప్రైజ్ అవ్వాలనే ఉద్దేశంతో ముందుగా అంచనాలను పెంచడం లేదట. అప్పటికి సినిమా రైటర్స్, టెక్నిషియన్స్ సినిమాలో కొన్ని సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నా అసలు బొమ్మ వెండితెర మీద చూడాల్సిందే అంటున్నారు. 


అంతేకాదు హింది ఆడియెన్స్ కోసం అమితాబ్, తమిళ వారి కోసం విజయ్ సేతుప్తి, కన్నడ ఫ్యాన్స్ కోసం సుదీప్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో నటుడు ఇందులో మంచి పాత్రలు చేశారు. ఇవి కూడా సినిమాకు చాలా ప్లస్ అవుతాయని తెలుస్తుంది. నయనతార, తమన్నాల పర్ఫార్మెన్స్ కూడా అందరిని మెప్పిస్తుందని తెలుస్తుంది. మరి సైరా టీజర్, ట్రైలర్ లను మించి సినిమాలో మ్యాటర్ ఉంటుందా లేదా అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: