మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా సినిమా బాహుబలి స్థాయిలో విజయం సాధిస్తుందని చాలామంది మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల తెలిపారు. బాహుబలి వంటి అద్భుతం లేకపోతే సైరా సినిమా లేదని స్వయంగా చిరంజీవి కామెంట్లు చేశారు. ఇటువంటి నేపథ్యంలో మరికొద్ది గంటల్లో సినిమా విడుదల అవుతున్న క్రమంలో అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి దాక చిరంజీవి నటించిన సినిమాలు ఒక ఎత్తు అయితే..సైరా సినిమా మరొక ఎత్తు అంటూ తెగ చర్చలు జరుపుకుంటున్నారు. కారణం చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కడం.


చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.ఈ సినిమాకి అన్ని భాషల్లో క్రేజ్ తీసుకురావడానికి ఆ భాషా నటులను తీసుకొచ్చారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, రవికిషన్ లాంటి నటులతో పాటు నయనతార, తమన్నాలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటివరకు రాజమౌళి సినిమాల్లోనే భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ చూశాం. ఇప్పుడు 'సైరా' కూడా విజువల్స్ తో ఆకట్టుకోనుంది. ఈ సినిమాలో 3800 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని సమాచారం. ఎమోషన్స్ తో కూడిన సినిమాలను వీఎఫ్ఎక్స్ షాట్స్ జోడించడం ఎంత కష్టమో తనకు తెలుసునని ఇటీవల రాజమౌళి చెబుతూ సురేందర్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు.


అంతేకాకుండా ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఒక టెక్నికల్ టీం ని తీసుకొచ్చి మరీ సినిమాని చిత్రీకరించారని సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాలో ఒక పాట కోసం 4500 మంది డ్యాన్సర్లతో దాదాపు 14 రోజుల పాటు చిత్రీకరించిన సాంగ్ సినిమాకే హైలెట్ అని ఫిలింనగర్ లో వినపడుతున్న టాక్. అంతేకాకుండా సినిమా క్లైమాక్స్ కోసం ఏకంగా 72 కోట్లు నిర్మాత రామ్ చరణ్ ఖర్చు పెట్టాడట. మొత్తమ్మీద సైరా సినిమా కోసం తాజాగా బయటకు వచ్చిన ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మెగా అభిమానులకు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఇదిలా ఉండగా సినిమా మరికొద్ది గంటల్లో కొన్నిచోట్ల ప్రీమియర్ షో లు పడటానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అభిమానులు హడావిడి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని దసరా పండుగ ముందే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మొత్తం మీద చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై మెగా అభిమానులకు చాలా అంచనాలు నెలకొన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: