దాదాపు మెగాస్టార్ 20 ఏళ్ళ కల. నిజం కాబోతోంది. ఆ కలను నిజం చేసింది మెగా పవర్ స్టార్ రాం చరణ్. మెగాస్టార్ సినిమా కెరీర్ లో ఒక వెలితిగా మిగిలిపోయో గొప్ప సినిమాని చేసి తన సినీ  జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు చిరు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్న..వంటి భారీ స్టార్ కాస్ట్ తో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించిన అత్యంత భారీ సినిమా సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా కోసం కొన్నేళ్ళుగా స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చాలా రీ సెర్చ్ చేసి కథ అందించారు. ఇక ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా కొన్ని నెలలపాటు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర మీద రీ సెర్చ్ చేసి ఎన్నో అంశాలను కథలో పొందు పరచారు. 

సైరా సినిమాలో చిరంజీవి పాత్ర చనిపోతుందని ప్రేక్షకుల్ని మానసికంగా కొన్ని రోజులుగా సిద్ధం చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డి దీనిపై క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు చిరంజీవి కూడా అదే పని చేస్తున్నారు. తన పాత్ర చనిపోతుందని, ప్రేక్షకులు షాక్ ఫీలవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.  
బ్రిటిష్ వాళ్లు నరసింహారెడ్డి తలను కోటగుమ్మానికి 30 ఏళ్ల పాటు వేలాడి ఉంచారని, ప్రజల్లో భయం పుట్టించేందుకే బ్రిటిషర్లు ఆ పనిచేశారని అయితే ఆ సన్నివేశం మాత్రం సైరా సినిమాలో ఉండదని స్పష్టంచేశారు. క్లయిమాక్స్ లో వచ్చే పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో సినిమా ముగుస్తుందని, అదంతా చాలా భావోద్వేగంతో నిండి ఉంటుందని.. సైరా క్లయిమాక్స్ గురించి వివరించారు.

ఇది చరిత్ర కాబట్టి, ప్రేక్షకులు కూడా సినిమాని అదే కోణంలో చూస్తే తప్పకుండా తృప్తి చెందుతారని మెగాస్టార్ ఎంతో ధీమాగా ఉన్నారు. అంతే కాదు ఒక కమర్షియల్ సినిమాని చూసిన విధంగా ఈ సినిమాని చూడొద్దని మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు సలహా ఇస్తున్నారు చిరు. నరసింహారెడ్డిలో పాత్రను మాత్రమే చూస్తారు, నన్ను చూడరని అంటున్నారు మెగాస్టార్. నరసింహారెడ్డి పాత్ర చనిపోతుందని అందుకే ముందు నుంచి చెబుతూ వస్తున్నాం. కాబట్టి ప్రేక్షకులు నిరాశపడరనే అనుకుంటున్నాను. అంతేకాదు, క్లయిమాక్స్ తర్వాత ఓ గొప్ప ఎమోషనల్ ఫీలింగ్ తో ప్రేక్షకుడు బయటకొస్తాడని నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: