1996లో క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, కథానాయుకుడు కమల్ హాసన్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భారతీయుడు’.  కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో తండ్రి,కొడుకు ఇద్దరి పాత్రల్లో కమల్ మెప్పించారు. స్వతంత్ర భారతదేశంలో సామాన్యులను పట్టిపీడిస్తున్న లంచగొండితనంపై ఓ స్వాతంత్య్ర సమరయోధుడు సాగించిన కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా  అప్పట్లో ఓ పెను సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా మళ్ళి  కమల్ హాసన్ హీరోగా ‘ఇండియన్‌ 2 (భారతీయుడు 2) ‘ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

జనవరిలో ప్రారంభం ఐన ఈ మూవీ షూటింగ్ గత కొద్దీ రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిచి పనిలో ఉన్నారు చిత్ర బృందం.
ఇదిలా ఉంటె ఈసినిమాలో కమల్ కు విలన్ గా బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ నటించబోతున్నాడనే వార్త కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతుంది. బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్ ప్రతినాయకుడిగా తమిళంలోకి ఎంట్రీ ఇస్తాడని వార్తలొచ్చాయి. 

కానీ ఇప్పుడు ప్లాన్ మారినట్టు కనిపిస్తోంది. బడ్జెట్ సమస్యల కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో అజయ్ దేవగన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని తెలుస్తుంది. అజయ్ దేవగన్ స్థానంలో అనిల్ కపూర్ విలన్ రోల్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి  శంకర్, అనిల్ కపూర్ మధ్య చర్చలు కూడా జరిగాయని, ఆయన సినిమాలో నటించడానికి సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు  కాజల్ అగర్వాల్ కూడా నటిస్తుంది. అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండగా..లైకా ప్రొడక్షన్ బ్యానర్ ఫై ఈ చిత్రం తెరకెక్కుతుంది. మకర సంక్రాంతి రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో కమల్.. మర్మకళ ఉపయోగిస్తున్నట్లు చేతివేళ్లతో ఓ స్టైల్ చూయించారు. ఇది భారతీయుడు సినిమాలోని కీలక నేపథ్యాన్ని గుర్తుచేసింది..


    మరింత సమాచారం తెలుసుకోండి: