మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సైరా ఎలాంటి ఫలితం అందుకోనుంది అన్న సస్పెన్స్ తొలగిపోయింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న టాక్ మెగా ఫ్యాన్స్ తో పాటు సినిమా ఇండస్ట్రీని, ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ బిజినెస్ సహా శాటిలైట్ వ్యాపారానికి సంబంధించి ఆసక్తికర సంగతులు వాస్తవాలు వెల్లడయ్యాయి. సైరా ప్రీరిలీజ్ బిజినెస్ 150 కోట్ల మేర సాగిందని అసలు లెక్కలు బయటికి వచ్చాయి. దీంతో ప్రీరిలీజ్ బిజినెస్ మీద పక్కా క్లారిటి వచ్చేసింది.

ఇక తాజాగా సైరా శాటిలైట్ హక్కుల్లోనూ అసలు వాస్తవం ఏంటో ఓపెన్ గా తెలిసిపోయింది. శాటిలైట్ రైట్స్ ని దక్కించుక్కున్న ప్రముఖ ఛానెల్ వాళ్లు స్వయంగా ఎంతకు కొన్నారో ప్రకటించారు. సైరా శాటిలైట్ ని జెమిని ఛానెల్ వాళ్లు చేజిక్కించుకున్నారు. నిర్మాత రామ్ చరణ్ భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడంతో చాలా ఛానెళ్లు వెనక్కి వెళితే జెమిని కాస్త ధైర్యం చేసి సైరా శాటిలైట్ రైట్స్ ని చేజిక్కించుకుందిట. తెలుగు-తమిళం-మలయాళం వరకూ  హక్కుల్ని ఈ ఛానెల్ చేజిక్కించుకోవడం విశేషం. కేవలం శాటిలైట్ కోసం 25కోట్లు జెమిని చెల్లిస్తోందట.

సైరా డిజిటల్ రైట్స్ మాత్రం నిర్మాత రామ్ చరణ్ జెమినికి ఇవ్వకపోవడం ఇక్కడ ట్విస్ట్. వాటిని అమెజాన్ ప్రైమ్ వాళ్లకు 50 కోట్లకు అమ్మేశారని తాజా సమాచారం. తాజా వివరాలతో శాటిలైట్ హక్కులు మొత్తంగా 120 కోట్లకు అమ్మారు అన్నది అసత్యం అని తేలిపోయింది. బహుభాషా చిత్రంగా పాన్ ఇండియన్ సినిమాగా రిలీజవుతోంది కాబట్టి శాటిలైట్ రైట్స్ వ్యవహారంలో చాలానే కన్ఫ్యూజన్స్ నెలకొన్నాయి. ఇక డిజిటల్ వరకూ అమెజాన్ లో వీక్షించే వీలుందని క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్న..వంటి భారీ స్టార్ కాస్ట్ తో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించిన సినిమా కొత్త రికార్డ్స్ నెలకొల్పడం ఖాయమని చెప్పుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: