ఈ ఇయర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ సైరా కోసం మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి తెలుగు సిని అభిమాని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పదేళ్ల తర్వాత ఖైది నంబర్ 150తో సత్తా చాటిన మెగాస్టార్ ఈసారి ఓ భారీ మూవీతో వస్తున్నాడు.


ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న సైరా సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఇన్నాళ్లు కేవలం కమర్షియల్ సినిమాలను మాత్రమే చేసిన సురేందర్ రెడ్డి మొదటిసారి పిరియాడికల్ మూవీ చేశాడు. అది కూడా ఓ స్వాతంత్ర సమరయోధుడి సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు బడ్జెట్ కూడా భారీగా పెట్టడం జరిగింది.


ఏం నమ్మకంతో సూరి చేతుల్లో ఈ ప్రాజెక్ట్ పెట్టారన్నది నిర్మాతగా చరణ్.. నటుడిగా చిరు చెబుతూ వచ్చారు. అయితే టీజర్, ట్రైలర్ చూస్తే సైరా ఆశించిన స్థాయిని అందుకునేలా ఉంది. అయితే సైరా సూపర్ హిట్ అయితే మనకు మరో రాజమౌళి దొరికేసినట్టే అని చెప్పొచ్చు. ఒకవేళ రిజల్ట్ తేడా కొడితే మాత్రం సురేందర్ రెడ్డి ఫ్యూచర్ డైలమాలో పడే అవకాశం ఉంది.


ఓ రకంగా సైరా సినిమా తన కెరియర్ లో ఓ పెద్ద సాహసమని తెలిసినా సురేందర్ రెడ్డి డేర్ గా ఈ మూవీ చేశాడు. తన మార్క్ డైరక్షన్ టాలెంట్ తో పాటుగా సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ అందరి సహకారంతో సైరాని పూర్తి చేశాడు సూరి. తప్పకుండా ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుని సంచలన విజయం అందుకోవాలని ఆశిద్దాం. హిందిలో కూడా సైరా సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటించడం వల్ల సినిమా అన్ని భాషల్లో క్రేజ్ తెచ్చుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: