మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ "సైరా" ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదల అవుతుంది.  ఉయ్యాలవాడ వంశీకులు కేసుల్ని వెనక్కి తీసుకోవడంతో ఈ సినిమాకి ఉన్న ఒక్క అడ్డంకి తొలగిపోయింది. రామ్ చరణ్ , చిరంజీవి, తమన్నా సురేందర్ రెడ్డి లు తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలు చుట్టి వచ్చారు. అక్కడి నుండి మంచి స్పందన వచ్చింది. నిన్న యూఎస్ లో ప్రీమియర్ షో లు మొదలయ్యాయి. అన్ని చోట్ల నుండి సినిమా పై మంచి టాక్ వస్తుంది.


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడంతో మొదలైన ఈ వివాదం సోమవారం ఆయన ఇన్స్టాగ్రామ్ లో సినిమా గురించి మాట్లాడటం ,చిరంజీవి ,రామ్ చరణ్ లను అభినందించడం తో ముగిసింది.  దాంతో అందరు సైరా సినిమా విడుదల అవుతుందన్న సంతోషం లో మునిగిపోయారు.

ఇలాంటి సమయంలో బన్ని పి ఆర్ ఓ చేసిన ట్వీట్ మరో వివాదానికి తెర లేపింది. ఈ ట్యీట్ ఎవరిని ఉద్దేశించిందో చెప్పలేదు.. 'ప్రేమ, ఆప్యాతవల్ల పనులు జరుగుతాయి కానీ ప్రెజర్ వల్ల కాదు. మనకి ఒక పని చెయ్యాలి అని అనిపించకపోతే ఎంత వత్తిడి వచ్చినా మనం అది చెయ్యం, ఇక్కడ మొత్తం ప్రేమే, ఎలాంటి ద్వేషం లేదు' అనేది ఆ ట్వీట్. ఈ ట్వీట్  మెగా అభిమానుల మెదడుల్లో  అనేక ప్రశ్నలను లేవనేత్తుతోంది.


సైరా  మొదటి రోజు భారీ వసూళ్ళు సాధించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు మరియు మెగా అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.అయితే సైరా కు తెలుగు రాష్టాల్లో , తమిళనాడు,మలయాళంలో ఫుల్ క్రేజ్ ఉంది కానీ  కర్ణాటకలో మరియు బాలీవుడ్  వార్ సినిమా తో  పోటీ తప్పదని సినీ పండితులు అంటున్నారు. సైరా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం బాక్సాఫీస్ బద్దలవడం మాత్రం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: