బుల్లి తెర  నటి హిమజ తెలుగు బిగ్ బాస్ 3 లో తనదైన ఆట తో అందరిని అలరించింది .  ఎలిమినెట్ అయిన  తర్వాత మళ్ళీ టీవీ షో లు మరియు సీరియల్స్ తో బిజీ అయ్యారు. రీసెంట్ గా ఒక వెబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. నాగార్జున గురించి మాట్లాడుతూ ఆయన బిగ్ బాస్ చూడరు కేవలం క్రియేటివ్ డైరెక్టర్ చెప్పింది మాత్రమే  చెప్తాడు . నాకు హేమకు గోడవ జరిగినపుడు  ఆయన నన్ను ఎందుకు ఏడ్చావు అని అడిగారు.ఆయన షో చూసింటే హిమజను ఎందుకు ఏడిపించావు హేమని అడిగేవారు.నాకు అప్పుడు అర్థం అయ్యింది అయన బిగ్ బాస్ చూడరని.ఆయన  ఫుటేజ్ చూసి   కంటెస్టంట్స్ ప్రశ్నలను అడిగి ఉంటే బాగుండేది.


రాహుల్ మరియు పునర్నవి మంచి ప్రెండ్ర్స్ కానీ బయట వారిని లవర్స్ లాగా చూపిస్తున్నారని అర్థం అవడంతో అలాగే కంటిన్యూ అవుతున్నారు. నాకు తేలిసి వారి మధ్యలో ఏమి లేదు అని చెప్పింది.ఇంట్లో ఉండే అర్హత ఎవరికి లేదు అన్న ప్రశ్నకు  మహేష్ విట్టకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని చెప్పింది.ఆయన గేమ్ లో జెన్యూన్ గా ఉండడు.ఆయన ఒక కంటెంట్ మేకర్ అని చెప్పింది.


మీరు బిగ్ బాస్ ఎందుకు వెళ్ళారు  అన్న ప్రశ్నకు బిగ్ బాస్ కి వెళ్ళడం నా  కెరియర్ కి  అంతగా ఉపయోగపడదని నాకు తెలుసు. అయినా అక్కడికి పోవడానికి కారణం  నన్ను నేను  స్ట్రాంగ్ గా చేసుకోవడానికి. .  చిన్నప్పటి నుండి  నాకు నచ్చని వ్యక్తులకు దూరంగా ఉండేదాన్ని.కానీ బిగ్ బాస్ లో మనకు నచ్చని వ్యక్తులు మన ముందే ఉంటారు. . నా పర్సనల్ లైఫ్ కి ఉపయోగపడుతుందని బిగ్ బాస్ కి వెళ్ళాను.

మరింత సమాచారం తెలుసుకోండి: