టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ సరసన స్టార్ హీరోయిన్ నయనతార జతకడుతున్న ఈ సినిమాలో మరొక హీరోయిన్ తామన్నా ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఇక పలు భాషలకు చెందిన దిగ్గజ నటులైన జగపతి బాబు, అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించడం జరిగింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా రెండు ట్రైలర్లు మరియు సాంగ్స్ ఎంతో బాగుండడంతో, సైరా పై ప్రేక్షకుల్లో నమ్మకాలు విపరీతంగా పెరిగాయి. 

ఇకపోతే గాంధీ మహాత్ముని జయంతిని పురస్కరించుకుని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై కొంత మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ముందుగా సినిమాలో విజువల్స్, సెట్స్ ఎంతో గ్రాండియర్ గా ఉన్నాయని, అలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయని అంటున్నారు. ఇక ముఖ్యంగా నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ ఎంతో ఒదిగిపోయి నటించినట్లు చెప్తున్నారు. కాకపోతే సినిమాలో కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయట. సినిమా లెంగ్త్ బాగా ఎక్కువయిందని, అలానే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ గా సాగుతుందని, ఇక సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సాగతీత సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. 

ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు భాగాలతో పోలిస్తే, సైరా వాటిని అందుకోవడం కష్టమే అంటున్నారు. మొత్తంగా చెప్పాలంటే ఈ సైరా సినిమాలో మెయిన్ గా కమర్షియల్ అంశాలు వంటివి మిస్ అవడం వలన థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడిని పూర్తి స్థాయిలో అలరించలేకపోయిందని, ఓవర్ అల్ గా సినిమా యావరేజ్ అని అంటున్నారు. అయితే దీనిపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, సినిమాలో చిరంజీవి గారి నటన ప్రధాన బలం అని, దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాను బాగా తెరకెక్కించారని, రాబోయే రోజుల్లో సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నట్లు రాజమౌళి తెలిపినట్లు సమాచారం......!!


మరింత సమాచారం తెలుసుకోండి: