సైరా నరసింహ రెడ్డి.. పెద్ద పెద్ద సినీ స్టార్స్.. భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా. పరుచూరి బ్రదర్స్ రచించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కొణిదెల వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను భారీస్థాయిలో నిర్మించాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించాడు.       


దాదాపూ ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డారు. ఎప్పుడు లానే అనుకున్నదానికంటే సురేందర్ రెడ్డి సినిమాకు మంచి టాక్ వచ్చింది. రామ్ చరణ్ కష్టానికి ఫలితం లభించింది. అంచనాలను మించి సినిమా చిత్రీకరణ అయ్యింది అంటున్నారు అభిమానులు. అయితే మరికొందరు అభిమానులు మాత్రం సినిమాని చూస్తుంటే చరిత్ర ఏమాత్రం గుర్తు రావడం లేదని అంటున్నారు.                         


అయితే ఈ సినిమా ఎలా ఉన్న .. సినిమాలోని డైలాగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు ప్రేక్షకులు. ప్రతి డైలాగ్ హృదయాన్ని తాకుతుంది అని చెప్తున్నారు. ఈ సినిమా మాటల రచయత బుర్రా సాయ వెంకన్న టాలీవుడ్ కు దొరికిన అద్భుత మాటల రచయత అని అంటున్నారు. కారణం అతని డైలాగ్లు అంత అద్భుతంగా ఉన్నాయి. 

                         

బుర్ర సాయి వెంకన్న .. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాకు వేమా రెడ్డితో కలిసి డైలాగ్ లు రాశారు. ఏది ఏమైనా తెలుగు ఇండస్ట్రీకి మరో మాటల మాంత్రికుడు బుర్ర సాయి వెంకన్న దొరికాడు.                           


మరింత సమాచారం తెలుసుకోండి: