కమల్ హాసన్ , కోలీవుడ్  స్టార్  డైరెక్టర్  శంకర్ కలయికలో  తెరకెక్కతున్నచిత్రం  'ఇండియన్ 2'.  గత కొద్దీ రోజుల  నుండి  నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈ చిత్రం.  అందులో  భాగంగా  ఇటీవల  రాజమండ్రిలో కమల్ హాసన్ పై కొన్ని కీలక సన్నివేశాలను  తెరకెక్కించగా  తాజాగా మరో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్  జాయిన్ అయ్యాడు.  ఆయన ఈ చిత్రంలో  విలన్ పాత్రలో నటిస్తున్నాడని  సమాచారం.  ఇక అనిల్ కు  కోలీవుడ్ లో ఇదే మొదటి సినిమా కానుంది. అయితే అనిల్ , శంకర్ డైరెక్షన్ లో నటించడం  మొదటి సారేం  కాదు. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో నాయక్ అనే చిత్రం తెరకెక్కింది. 



సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  కాజల్ కథానాయికగా నటిస్తుండగా   రకుల్ ప్రీత్ సింగ్ , ప్రియా భవాని శంకర్ , సిద్దార్థ్ , వెన్నల కిషోర్, విద్యుత్ జంవాళ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి  యంగ్ మ్యూజిక్  సెన్సేషన్  అనిరుధ్ రవిచంద్రన్   సంగీతం అందిస్తున్నాడు.  కమల్ -శంకర్  కలయికలో  ఇది రెండో చిత్రం  ఇంతకుముందు 1996లో వీరి కాంబినేషన్ లో వచ్చిన  ఇండియన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మరి ఇన్ని  సంవత్సరాల తరువాత  ఈ చిత్రానికి  కి సీక్వెల్ గా వస్తున్న ఈ  ఇండియన్ 2  ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.   వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం  తమిళం తో పాటు తెలుగు ,హిందీ భాషల్లో విడుదలకానుంది.  ఇక ఈసినిమా తరువాత   కమల్ రాజకీయాల్లో బిజీ కానున్నాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: