ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిరంజీవి లో పరకాయ ప్రవేశం చేసిన వేల  సైరా నరసింహారెడ్డి. ఇప్పుడు దేశమంతట సైరా నరసింహారెడ్డి మేనియా నడుస్తోంది. ఎవరి నోట చూసిన సైరా మాట... ఎటువైపు విన్నా సైరా పాట. ఇప్పుడు దేశమంతా సైరా నరసింహారెడ్డి సై సై అంటూ నినదిస్తూ ఉంది. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నేడు విడుదలై పాజిటివ్  టాక్ తో దూసుకుపోతుంది. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా... మొదటి చారిత్రాత్మక సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. అయితే నేడు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను భర్తీ చేస్తూ అందరి మెప్పు పొందుతుంది సైరా నరసింహారెడ్డి. 

 

 

 

 ఒక స్వతంత్ర సమరయోధుడు సినిమా కావడం... భారీ బడ్జెట్ తో సినిమాను  నిర్మించడం... వివిధ ఇండస్ట్రీలలో పేరొందిన నటులు సైరా సినిమాలో నటించడం ఇదంతా కలిపి సైరా పై అంచనాలను పెంచేసాయి . అందుకే దేశ ప్రజలందరూ సైరా సినిమా చే చూయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవి  తన నట విశ్వరూపం చూపించాడు. సినిమాలో నటించింది మెగాస్టార్ చిరంజీవి కాదు... స్వయంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చి నటించాడేమో అన్నంతగా చిరంజీవి ఆ పాత్రను ప్రభావితం చేశాడు. చిరంజీవి వేషధారణ, ఆయన నరసింహారెడ్డి పాత్రలో  జీవించిన తీరు చూస్తే... ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. 

 

 

 

 ఇక చిరంజీవి ఆరు పదుల వయసులోనూ యాక్షన్ సన్నివేశాలను ఇరగదీసాడు.అయితే సినిమాలో  వివిధ ముఖ్యపాత్రల్లో నటించిన అమితాబచ్చన్ జగపతిబాబు విజయ్ సేతుపతి సుదీప్ నయనతార తమన్నా తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. అయితే సినిమా విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న సైరా నరసింహారెడ్డి... మెగా అభిమానుల్లో  ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. కాగా సైరా నరసింహారెడ్డి సినిమా చిరంజీవి కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలబడుతుందని పలువురు భావిస్తున్నారు. చూడాలి మరి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సైరా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందని.

మరింత సమాచారం తెలుసుకోండి: