మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియాస్ మూవీ 'సైరా నరసింహ రెడ్డి'. ఇప్పటివరకు చిరు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా భారీ తారాగణంతో సైరా ను నిర్మించాడు. ఇక ఈరోజు థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మీద రక రకాల టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ కథ మెగాస్టార్ తో పాటు పరుచూరి బ్రదర్స్ కి కూడా డ్రిమ్ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్  ఏళ్ళ తరబడి రీసెర్చ్ చేసారు. కొన్నేళ్ళ పాటు ఈ కథ రాయడం కోసం అవస్థలు పడ్డారు కూడా. కారణం బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అన్ని రకాలుగా ప్రేక్షకులు కంపేర్ చేస్తారు. ఎవరు కాదన్నా ఈ మాట వాస్తవం. బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి అమాంతం పెంచేశారు దర్శక ధీరుడు రాజమౌళి. 

అందుకే పరుచూరి ఓల్డ్ వర్షన్ స్క్రీన్ ప్లేతో సినిమా చేస్తే ఖచ్చితంగా బోల్తా కొడుతుందన్న ఉద్దేశ్యంతోనే దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా కథ కోసం చాలా రీసెర్చ్ చేశాడు. ఎందుకంటే ఒక స్వాతంత్ర  సమరయోధుడి కథ కాబట్టి ఇప్పటి వారు కూడా మెచ్చేలా గొప్పగా సినిమాను తీయాలి. అంతేకాదు 'సైరా' బాహుబలి ని మించిందిగా ఉండాలి.... అన్నట్టుగా బాగా కృషి చేశారు. అందుకే భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. కానీ అది పబ్లిసిటి కోసం పోస్టర్స్ మీద ఉపయోగపడింది తప్ప సినిమాలో మాత్రం అంతగా ఉపయోగపడలేదనే చెప్పాలి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్న..వంటి భారీ స్టార్ కాస్ట్ తో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించిన అత్యంత భారీ సినిమా సైరా నరసింహా రెడ్డి లో సరిగ్గా ఒక్క పాత్ర కూడా కొన్నేళ్ళ పాటు చెప్పుకునే పాత్ర ఒక్కటి లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి. 

మరి తెర మీద అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్న, నయనతారా ఉన్నారు కదా..అంటే కన్‌ఫ్యూజన్ తప్ప ఏమీ కనిపించడంలేదు. అదే బాహుబలి సినిమా గనక చూస్తే మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి గా రెండు పాత్రల్లో ప్రభాస్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. అలాగే రానా దగ్గుబాటి భల్లాలదేవ గా పెద్ద క్రేజ్ వచ్చింది. ఇక ముఖ్యంగా శివగామిగా రమ్యకృష్ణ ను తప్ప మరెవరిని ఊహించుకోలేనంతగా ఆ పాత్ర ఫేమస్ అయింది. అనుష్క, తమన్న, కట్టప్ప గా సత్యరాజ్, నాజర్, కాలకేయుడిగా ప్రభాకర్..ఇలా ముఖ్య పాత్రలన్ని బాహుబలి సినిమా పేరు తలుచుకుంటేనే కళ్ళ ముందు కనపడతాయి. అలాంటి పాత్ర ఒక్కటి కూడా లేకపోవడం సైరాకు పెద్ద వెలితే. 


మరింత సమాచారం తెలుసుకోండి: