మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి 20 ఏళ్ళ కల నిజం అయిన రోజు. ఆ కలను నిజం చేసింది మెగా పవర్ స్టార్ రాం చరణ్. మెగాస్టార్ సినిమా కెరీర్ లోనే చేయలేమో అనుకున్న ఒక స్వాతంత్య్ర  సమరయోధిడి కథ పాత్ర. నిజంగా ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఏ హీరో ఇలాంటి కథ కోసం గాని, పాత్ర కోసం కాని ఎదురు చూడరు.అలాంటిది తన సినీ ప్రయాణంలోనే ఒక వెలితిగా మిగిలిపోయో గొప్ప సినిమాని చేసి తన సినీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకున్నారు చిరు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్న..వంటి భారీ స్టార్ కాస్ట్ తో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించిన అత్యంత భారీ సినిమా సైరా నరసింహా రెడ్డి. 

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర కోసం కొన్నేళ్ళుగా స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చాలా రీసెర్చ్ చేసి కథ అందించారు. ఇక ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా కొన్ని నెలలపాటు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర మీద రీసెర్చ్ చేసి ఎన్నో అంశాలను కథలో చేర్చాడు. మొదటి స్వాతంత్య్ర యోధుడి కథ కాబట్టి తెలుగు తో సహా అన్నీ ప్రధాన భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని సైరా బృందం ముందు నుంచే సన్నాహాలు చేసుకున్నారు. అందుకే ఒక్కో భాష నుండి ఒక్కో ఫేమస్ నటుడిని తీసుకున్నారు. 

అందుకనే హిందీ నుండి బిగ్ బి అమితాబ్ ని, కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి, హీరోయిన్ నయన తార, కన్నడ నుండి సుదీప్ వంటి ఫేమస్ యాక్టర్స్ ని తీసుకున్నారు. ఆయా భాషల్లో మాంచి పబ్లిసిటీని చేశారు. కానీ సైరా మొదటి షో నుండే కాస్త నెగిటివ్ టాక్ వస్తోంది. మొదటి రోజే ఇలాంటి టాక్ వస్తే నెక్స్ట్ డే కి ఈ టాక్ ఎలా మారుతుందోనని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు తెలుగులోనే ఇలా ఉంటే మిగతా భాషల సంగతి ఏంటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏదేమైనా మొత్తంగా చూస్తే మాత్రం కలెక్షన్స్ పరంగా మొదటి రోజు భారీగానే వసూళ్ళను రాబట్టింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: