చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తన కొడుకు రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. హేమహేమీయులతో తెరకెక్కించిన ఈ చిత్రం చిత్రీకరణ మొదలైన రోజు నుంచే అంచనాలను అంతకంతకూ పెంచుకుంటూ పోగా... ఇక రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఖాయం అని అనుకున్న మెగా ఫ్యాన్స్ కు చివరకు నిరాశ మిగిలింది. అతి భారీ హైప్ తో థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం... ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ హీరో ఉన్నా కూడా యూ.ఎస్ ప్రీమియర్ విషయంలో సైరాకు చివరికి నిరాశే మిగిలింది.

డిజాస్టర్ టాక్ తో నిలిచిన సాహో చిత్రం కూడా ఆఖరికి యూ.ఎస్ ప్రీమియర్ కలెక్షన్ల విషయంలో సాహో కన్నా ఎక్కువ రాబట్టింది. ఉదయాన్నే సినిమాకి వచ్చిన టాక్ మరియు ముందునుంచి ఉన్న హైప్ నేపథ్యంలో బాహుబలి తర్వాత స్థానంలో... లేదంటే కనీసం టాప్-5 లో అయినా ఉంటుందని భావించిన ఈ చిత్రం యూ.ఎస్ ప్రీమియర్స్ లో భారీగా చతికిలపడింది. బాహుబలి 2 చిత్రం ప్రీమియర్ షోల ద్వారా 2.5 మిలియన్ డాలర్లను వసూలు చేయగా అజ్ఞాతవాసి, బాహుబలి చిత్రాలు 1.52 మిలియన్ డాలర్లు రాబట్టి రెండు, మూడు స్థానంలో నిలిచాయి. కనీసం ఆ తర్వాతి స్థానంలో నిలుస్తుందని ఊహించినా సైరా కనీసం 5వ స్థానంలో కూడా లేకపోవడం గమనార్హం.

చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్.150 1.29 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉండగా… మహేష్ బాబు అట్టర్ డిజాస్టర్ సినిమా 'స్పైడర్' ఒక మిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో ప్రభాస్ 'సాహో' 9.15 లక్షల డాలర్లను రాబట్టింది. సాహో తర్వాత స్థానంలో నిలిచిన 'సైరా' 8.53 లక్షల డాలర్లతో సరిపెట్టుకుంది. వీకెండ్ కాకపోవడం మరియు ఇతరత్రా కారణాల వల్ల సినిమా ప్రీమియర్ షో కలెక్షన్స్ విషయంలో సైరా కు భారీ షాక్ తగిలింది. ఇంకా లాంగ్ రన్ లో అయినా ఈ చిత్రం వసూళ్ల పరిస్థితి మారుతుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: