సైరా నరసింహా రెడ్డి సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి అసలైతే తాను భగత్ సింగ్ జీవిత చరిత్రతో సినిమా చేయాలని అనుకున్నట్టు చెప్పుకొచ్చారు. కాని నరసింహా రెడ్డి జీవిత కథ వినగానే తనకు నచ్చేసిందని అందుకే భగత్ సింగ్ ను వదిలి పెట్టి సైరా సినిమాను ఓకే చేసినట్టు చెప్పారు. అంతేకాదు సైరా కథను పరుచూరి సోదరులు దాదాపు పదేళ్లుగా మోస్తూనే ఉన్నారు.  


తన డ్రీం ప్రాజెక్ట్ భగత్ సింగ్ అని.. సైరా చేశాను కాబట్టి ఇక అది చేసే అవకాశం లేదని. ఒకవేళ భగత్ సింగ్ అవకాశం వస్తే రాం చరణ్ చేస్తాడని అంటున్నారు చిరంజీవి. సైరా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో చిరంజీవి సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైన ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది.


ఇక రాం చరణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న చరణ్ ఆ సినిమా తర్వాత ఎవరితో చేస్తాడా అన్న కన్ ఫ్యూజన్ ఉంది. చరణ్ ఒప్పుకుంటే తనతో కచ్చితంగా భగత్ సింగ్ చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీగా ఉంటారు. రంగస్థలం తర్వాత ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తున్న చరణ్ ఆర్.ఆర్.ఆర్ తో తన రేంజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు.   


నిజంగా భగత్ సింగ్ జీవిత కథతో రాం చరణ్ సినిమా చేస్తే కనుక ఆ సినిమా కూడా నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఇన్నాళ్లు బాలీవుడ్ సినిమాలు భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారితే ఇప్పుడు తెలుగు పరిశ్రమని చూసి బాలీవుడ్ మేకర్స్ కంగారు పడేలా చేస్తున్నారు. రాజమౌళి బాహుబలి.. సురేందర్ రెడ్డి సైరా నరసింహా రెడ్డి వీటికి ఉదాహరణ అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: