మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఇండస్ట్రీ అంతా సైరా జపం చేస్తుంటే ఒక హీరో మాత్రం తన సినిమా కోసం ప్రమోట్ చేసుకుంటున్నాడు. సైరాకు పోటీగా తన సినిమా రిలీజ్ చేస్తున్నాడు మాచో హీరో గోపిచంద్.   


తిరు డైరక్షన్ లో గోపిచంద్ హీరోగా నటించిన సినిమా చాణక్య. బుధవారం సైరా రిలీజ్ అవగా శనివారం చాణక్య రిలీజ్ అవుతుంది. అయితే సైరాకు పోటీ తమకేం ప్రాబ్లం కాదంటున్నాడు గోపిచంద్. సైరా సినిమాకు పోటీగా రావాలని అనుకోలేదు అయితే మా సినిమా ముందే రిలీజ్ ఎనౌన్స్ చేశాం.


చాణక్య సినిమా మే నెలలోనే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కొన్ని పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత తమ సినిమా దసరాకి రిలీజ్ అనుకున్నాం. అయితే ఆ టైం కు సైరా వస్తుందని తమకు తెలియదని.. సైరాతో పోటీ తమకు ఏమాత్రం ఇబ్బంది లేదని అంటున్నాడు గోపిచంద్. చాణక్య ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.  


అయితే కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేని గోపిచంద్ చాణక్యతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న చాణక్య ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ చాణక్య హిట్ అయితే కచ్చితంగా సైరా కలక్షన్స్ మీద దీని ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ చాణక్య కూడా నిరాశపరిస్తే మాత్రం సైరాకు హెల్ప్ అయినట్టే. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో గోపిచంద్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత గోపిచంద్ సంపత్ నంది డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.  




మరింత సమాచారం తెలుసుకోండి: