ఒక ఈగని  హీరోని చేసి మన దర్శక ధీరుడు రాజమౌళి తీసిన సినిమా ఈగ.ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు కన్నడ హీరో కిచ్చా సుధీప్.విల్లన్ గా తెలుగు ఎంట్రీ ఇచ్చిన సుదీప్ కు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.అప్పటి నుండి  కన్నడలో స్టార్ హీరోగా భారీ చిత్రాలలో నటిస్తూనే అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగు సినిమాల్లో ప్రాముఖ్యం ఉన్న పాత్రలలో నటిస్తున్నాడు సుధీప్.

ఇటీవల సుల్తాన్ పేరుతో ఫాన్ ఇండియా మూవీ విడుదల చేసిన సుధీప్ సైరా చిత్రంలో అత్యంత కీలకకమైన పాత్రలో నటించారు.  నేడు సైరా మూవీ విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మూవీలో సుదీప్ పాత్రను ప్రముఖులు కొనియాడుతున్నారు.ఇక దర్శకధీరుడు రాజమౌళి ఈ మూవీ చిత్ర యూనిట్ నటులను ప్రశంసిస్తూ, వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం జరిగింది. చిరంజీవినైతే ఆకాశానికి ఎత్తేశారు.

 

''శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి పరకాయ ప్రవేశం చేశారు. చరిత్రలో కనుమరుగైన నిప్పులాంటి కథను ఆయన వెలికితీశారు. జగపతిబాబు గారు. కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా.. ఇలా ప్రతి పాత్ర కథలో భాగంగా రావడమే కాకుండా పరస్పరం ముడిపడి ఉన్నాయి'' అని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

ఇంత గొప్ప సినిమాను నిర్మించిన రామ్ చరణ్‌కు, దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డికి రాజమౌళి అభినందనలు తెలిపారు.దీనికి స్పందించిన సుధీప్ “నా జీవితంలో జరిగిన అందమైన మార్పులకు రాజమౌళి తెరకెక్కించిన ఈగ చిత్రంలో చేసిన పాత్రనే.ఈగ సినిమాలో నాకు కేరీర్‌లో మ‌రిచిపోలేని పాత్ర ఇచ్చారు రాజమౌళి. ధన్యవాదాలు సర్”అని రాజమౌళి పట్ల తన కృతజ్ఞత తెలియజేశారు సుధీప్.

మరింత సమాచారం తెలుసుకోండి: