తెలుగులో, తమిళ్ భాషల్లో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ నయనతార. డేరింగ్ పాత్రలో, లేడి ఒరింటెడ్ పాత్రలోనూ, రొమాంటిక్ పాత్రలోనూ నటించడంలో ఒక్క అడుగు ముందే ఉంటుంది నయన్. అందుకే ఈమెను లేడి బాస్ అని అందరు ముద్దుగా పిలిపించుకుటుంది.ఏ సినిమా చేసిన అందులో కొత్త ధనాన్ని చూపించడంలో నయన్ స్పెషల్. 


ఇకపోతే నయనతారకు ఈ సంవత్సరం అంతగా కలిసి రాలేదని చెప్పాలి. వరుసగా నాలుగు సినిమాలు డిజాస్టర్స్ గా మారాయి అయినా కూడా ఎక్కడా వెనకడుగు వెయ్యకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. విశ్వాసం సినిమాలో అజిత్ తో కలిసి నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దానితో మరిన్ని సినిమా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అది కాక, ఈమెకు అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయన్ హీరోలకు పోటీగా సాగుతుంది. 


ఎన్నో ప్రత్యేక చిత్రాల్లో నటించిన నయన్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే ఈమె ప్రేమలో మునుగుతూ తేలుతుంది అనే విషయం కూడా తెలిసిందే. గతంలో ప్రభుదేవాతో ప్రేమలో మునిగి ఉన్న ఈ బ్యూటీ ఏమైందో తెలియదు కానీ, సడన్ గా బ్రేకప్ చెప్పింది. ఆ తరువాత ఆర్యతో కూడా ప్రేమలో పడింది. అది కూడా బ్రేకప్ చెప్పింది. ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమ పాఠాలు నేర్చుకుంటుంది. 


వివరాల్లోకి వెళితే.. ప్రియుడితో సహజీవనం చేస్తున్న నయన్ రీసెంట్ గా పెళ్లి చేసుకోబోతుందని వెల్లడించింది. మరో విశమేంటంటే ఎవరితోనో సినిమా చేస్తే ఆ సినిమా హిట్ అయితే వారికి డబ్బులు వస్తాయి నాకేమొస్తుంటాయి అనుకున్న ఈ బ్యూటీ తన ప్రియుడిని నిర్మాతగా పెట్టి ఓ సినిమాలో నటిస్తుంది. ఆ సినిమానే ‘నెట్రికన్’..దర్బార్ సినిమా పూర్తయ్యాక ఈ సినిమాలో నటిస్తుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: