మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా 151వ సినిమాగా తెర‌కెక్కిన సినిమా సైరా. బుధ‌వారం గాంధీజ‌యంతి సంద‌ర్భంగా ఏకంగా ఐదు భాష‌ల్లో సైరా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇటు తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ అయిన సైరాకు తెలుగులోనే అంతంత మాత్రం టాక్ వ‌చ్చింది. క‌ర్నూలు జిల్లా రేనాటి ప్రాంతానికి చెందిన తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు అయిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కింది.


ఓవ‌రాల్‌గా సినిమాకు మిక్స్ డ్ టాక్ ఉన్నా ప్ర‌తి ఒక్క‌రు మాత్రం ఆరు ప‌దుల వ‌య‌స్సులో కూడా చిరు న‌ట‌న అమేజింగ్ అని ప్ర‌శంసిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు సైరాకు ప‌ర్వాలేద‌నిపించే రేంజ్‌లో ప్ర‌శంస‌లు... క‌లెక్ష‌న్లు బాగున్నా అటు బాలీవుడ్‌లోనూ, ఇటు త‌మిళ్‌తో పాటు మ‌ళ‌యాళంలో సైరా డిజాస్ట‌ర్ అయ్యింది. ఈ సినిమాను అక్క‌డ ప్రేక్ష‌కులు తిర‌స్క‌రించార‌ని తొలి రోజు వ‌సూళ్లే చెప్పేస్తున్నాయి.


హిందీలో ఘోరంగా కేవ‌లం రు. 2 కోట్ల గ్రాస్ మాత్ర‌మే వ‌చ్చింది. అంటే అక్క‌డ థియేట‌ర్ల రెంట్లు కూడా రాని ప‌రిస్థితి. పైగా అక్క‌డ స‌ల్మాన్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌ను సైతం ప్ర‌మోష‌న్ల‌కు వాడుకున్నారు. ఇక హిందీలో అదే రోజు వ‌చ్చిన స్టార్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్ హీరోల చిత్రం కావడంతో పాటు, భారీ బడ్జెట్ చిత్రం కావడంతో సైరాకు త‌క్కువ థియేట‌ర్లే ఇచ్చారు.


ఇక వార్ తొలి రోజే ఏకంగా రు.50 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు సాధించిందంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే హాలీవుడ్ మూవీ జోకర్ కూడా రు. 6 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్ట‌గా సైరా అందులో మూడో వంతు కూడా రాబ‌ట్ట‌లేదు. అటు త‌మిళ్‌, మ‌ల‌యాళంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. త‌మిళ‌నాడులో కూడా థియేట‌ర్ల రెంట్లు రాని పరిస్థితి ఉంద‌ట‌. ఇక మ‌ళ‌యాళంలో ఈ సినిమాను ప‌ట్టించుకోలేదంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: