ప్రస్తుతం ఫ్లాప్స్‌లో ఉన్న గోపీచంద్ తన రీసెంట్ సినిమా చాణక్య పై మాత్రం చాలా హోప్స్ పెట్టుకున్నాడు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందినా ఈ సినిమా  ట్రైలర్2కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.  అయితే ఈ సినిమాని సైరా రిలీజ్ అయిన రెండు రోజుల గ్యాప్‌లో రిలీజ్ చెయ్యడం అనేది మాత్రం కాస్త డేరింగ్ అండ్ రిస్కీ డెసిషన్ అంటున్నారు ప్రేక్షకులు. సైరా పై భారీ బజ్ ఉన్నా కూడా చాణక్య టీమ్ వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు.

దీనికి తోడు హాలీవుడ్ జోకర్, బాలీవుడ్ వార్ లు రాబోతున్నాయి.అందుకే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోను ఆ సినిమా రిలీజ్ అనేది అనివార్యం అని తేలింది. దీంతో వాళ్ళు అలానే ముందుకు వెళుతున్నారు.అయితే ఇప్పుడు రిలీజ్ అయిన సైరా  చూసినవాళ్లు అంతా కూడా ఫుల్ పాజిటివ్ టాక్ ఇచ్చారు.దీనికితోడు మెగాస్టార్ మ్యానియా కూడా తోడయితే ఇంక చాణక్య పరిస్థితి కాస్త కష్టమే. దీనికి తోడు చాణక్య సినిమాకి థియేటర్స్ ఇవ్వొద్దు అని మెగాక్యాంప్‌కి సంబందించినవాళ్లు ఎవరో ఫోన్ చేసి చెబుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితుల్లో చాణక్య రిలీజ్ సవ్యంగా సాగుతుందా అనేది అనుమానమే. సినిమా బావున్నా కూడా అరకొర థియేటర్స్‌లో రిలీజ్ చేస్తే మాత్రం ఇబ్బంది తప్పదు.  అందుకే ఇప్పుడు చాణక్య టీమ్ ఎలాగయినా మంచి థియేటర్స్ సంపాదించే పనిలో బిజీగా ఉంది అని టాక్.ఇవి రెండు కూడా రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలు కాబట్టి ఏ ప్రాబ్లెమ్ ఉండదు అనేది ఈ సినిమా టీమ్ ఆలోచన. పైగా ఈ సినిమా పై వీళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

సైరాలో పాటలు, హీరోయిన్ గ్లామర్ వంటివి టచ్ చెయ్యడానికి స్కోప్ లేదు. ఇక్కడ మాత్రం ఆ ఎలిమెంట్స్ కూడా ఫుల్‌గా వాడుకున్నారు. అందుకే చాణక్య సినిమా టీమ్ కూడా హిట్ మీద ధీమాతో ముందుకు వెళుతున్నారు. మరి సినిమాలో కంటెంట్‌తో పాటు పండగ సీజన్ ఎంతవరకు చాణక్యని గట్టెక్కిస్తుంది అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: