ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జోనస్ బాలీవుడ్ అందాల తార ప్రియాంక ను పెళ్ళి చేసుకోవడంతో భారతీయులకు పరిచయం అయ్యాడు.  నిక్ జోనస్ అతని సోదరులతో కలిసి "జోనస్ బ్రదర్స్" అనే బ్యాండ్ ను స్థాపించాడు. వీరు ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రదర్శనలు ఇస్తారు.  రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన జీవతంలో జరిగిన ఒక చేదు సంఘటన గురించి చెప్పాడు. నిక్ జోనస్ కి చిన్నప్పటి నుండే సంగీతం అంటే ప్రాణం.


ఆయన 10 వ ఏట రిలీజ్ చేసిన పాట చూసి కొలంబియ రికార్డ్స్ వారు ఆయన తో ఒక పాట ఒప్పందం చేసుకున్నారు. తనకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు సడన్ గా బరువు తగ్గడం మొదలైంది. దాంతో భయపడ్డ అతని తల్లి తండ్రులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అన్ని పరీక్షలు చేసిన తరువాత డాక్టర్లు ఆయనకు డయాబెటిస్ అని తేల్చారు. ఒక్కరోజు ఆలస్యమై ఉంటే నిక్ కోమలోకి వెళ్లే వాడని డాక్టర్లు చెప్పారు.


నిక్ నేను బాగానే ఉంటాను కదా అని అతని తల్ల తండ్రులను పదే పదే అడిగేవాడట . తను సంగీతానికి ఎక్కడ దూరమై పోతానని అనుకున్నాడు. ఈ వ్యాధి తన సామర్థ్యాన్ని తక్కువగా చేస్తుందేమోనని  చాలా భయపడ్డాడట. నిక్ జోనస్ కి ఇప్పుడు 27 సంవత్సరాలు నియంత్రణలో పెట్టుకుంటే డయాబెటిస్  ప్రమాదకరమైన వ్యాధి కాదు అంటున్నాడు.నిక్ జోనస్ మరియు  ప్రియాంక కు 2018 డిసెంబర్ 1 న పెళ్లి జరిగింది. 


నిక్ జోనస్ మరియు ప్రియాంకల మధ్య వయస్సు తేడా దాదాపుగా 11 సంవత్సరాలు. నిక్ కొన్ని హలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. ఆయన నటించిన జుమాంజి సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే డిసెంబర్ లో జుమంజి   సినిమా విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: