మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఎంతో భారీ స్థాయిలో పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కిన ఈ సినిమాను, తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక గాంధీ జయంతి కానుకగా ఎన్నో అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకొని మెల్లగా ముందుకు సాగుతోంది. ఇక ముఖ్యంగా ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి అత్యద్భుతమైన నటన మరియు డైలాగ్స్ ప్రధాన బలంగా నిలవగా, ఫోటోగ్రఫీ, సెట్టింగులు, 

ఆర్ట్ డైరెక్షన్, వంటివి పర్వలేదనిపించాయి. బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, విలక్షణ నటుడు జగపతిబాబు, భోజ్ పురి నటుడు రవి కిషన్, శాండల్ వుడ్ నటుడు సుదీప్ వంటివారు తమ పాత్రల్లో ఎంతో ఓడిగిపోయి నటించినప్పటికీ, సినిమాలో వారి పాత్రల నిడివి చాలా తక్కువ గానే ఉండటంతో అవి ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయాయని తెలుస్తోంది. స్వాతంత్రోద్యమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి సినిమాటిక్ గా సాగినప్పటికీ, సినిమాలోని ఎమోషన్ సరిగ్గా పండలేదని అంటున్నారు మెజారిటీ ప్రేక్షకుల. అలానే యాక్షన్ మరియు ఎమోషనల్ సన్నివేశాలకు ఎంతో పెద్దపీట వేసిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో సహజత్వం లోపించింది అని కూడా అంటున్నారు. 

నేటికి సినిమా రిలీజ్ అయి రెండో రోజే అయినప్పటికీ, సైరా చాలా ప్రాంతాల్లో తక్కువ స్థాయి కలెక్షన్ల తోనే ముందుకు సాగుతున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. దర్శకుడు సురేందర్ రెడ్డి స్వతంత్ర నేపథ్యం ఉన్న మంచి కథను ఎంచుకున్నప్పటికీ, దానిని తెరపైన ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో చాలా వరకు ఫెయిల్ అయినట్లుగా చెబుతున్నారు. మరి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప కలెక్షన్లతో ముందుకు సాగుతోన్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో ఎంతమేర కలెక్ట్ చేసి బయ్యర్లను సేఫ్ చేస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: