బాహుబలి సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన....  మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం భారీ అంచనాల నడుమ నిన్న దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది.  తారస్థాయిలో ఉన్న అంచనాలను అందుకుంటూ ఘనవిజయంగా నిలిచింది.సినిమా గురించి ఎక్కడ చూసిన పాజిటివ్ టాకే వినిపుల్ జోష్ లో ఉన్నారు మెగా ఫాన్స్. చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడుతున్నారు మెగా అభిమానులు.

టాలీవుడ్ చరిత్రలో బాహుబలి తరువాత ప్రముఖులు ఒక సినిమా పై స్పందించారు అంటే అది ఒక్క సైరా కి మాత్రమే అని చెప్పాలి. ముఖ్యంగా `బాహుబలి`తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి `సైరా` సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. `శ్రీ ఉయ్యలవాడ నర్సింహారెడ్డిగారి పాత్రలో చిరంజీవిగారు జీవం పోశారు. ఈ  పాత్రలో చిరంజీవి గారి నటన అద్భుతమని, అమోఘమని ట్వీట్ చేసాడు జక్కన్న... చరిత్ర మరిచిన వీరుడి కథను తన అద్భుతమైన నటనతో మళ్ళీ గుర్తు చేసారని రాజమౌళి ట్వీట్ చేసాడు.


సురేందర్ రెడ్డి చరిత్రను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎంత రిచ్‌గా ఉందో రాంచరణ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంతే రిచ్‌గా ఉన్నాయిచరిత్ర మరిచిపోయిన వ్యక్తిని స్మరణకు తెచ్చారు. ఉయ్యాలా వాడ గురువు పాత్రలో బిగ్ బి అమితాబ్, ఇతర తారాగణం  తమిళ హీరో విజయ్ సేతుపతి,  జగపతిబాబు, కిచ్చ సుదీప్, నయనతార, తమన్నా.. ఇలా ప్రతీ పాత్ర కథలో భాగమవుతూ మరింత ఆసక్తిని కలిగించాయి.

బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రామ్‌చరణ్‌కు హృదయపూర్వక అభినందనల`ని రాజమౌళి ట్వీట్ చేశారు. . ఇక సినిమాలో సామంత రాజులుగా  జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్.....ఉయ్యాలవాడ భార్యగా  నయనతార,ఒక కీలకమైన పాత్రలో  తమన్నా అద్భుతంగా నటించారు. రామ్ చరణ్, సురేందర్ రెడ్డికి కూడా కంగ్రాట్స్ చెప్పాడు రాజమౌళి...ఒక్క రాజమౌళినే కాదు దర్శకులు క్రిష్, వెంకీ అట్లూరి, నిర్మాత శోభు యార్లగడ్డ, హీరో మంచు మనోజ్ ‘సైరా’ను పొగుడుతూ ట్వీట్లు చేశారు.
.


మరింత సమాచారం తెలుసుకోండి: