ఈ వారం విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమాకి వరల్డ్ వైడ్ గా పాజిటివ్ టాక్ వస్తుందనుకుంటే అది రివర్స్ అయి నెగిటివ్ టాక్ వచ్చింది. పక్కా హిట్ జోనర్ లోకి వెళ్ళినట్లే అనుకుంటుంటే అది కూడా తేడా కొట్టినట్టే అని తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్ కి సైరా చూసాక పండగ చేసుకోవడం కాదు.. పూనకాలొచ్చేస్తున్నాయ్ అనుకుంటున్నారందరు. కాని వాస్తవంగా చూస్తుంటే పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనపడుతున్నాయి. ఐదు భాషల్లో సైరా కి నెగిటివ్ గానే టాక్ వస్తోంది. ఇక సినిమా హిట్ అని సైరా యూనిట్ అందరిలో కన్నా ఎక్కువగా హీరోయిన్ తమన్నానే సంతోషంతో గంతులేస్తుంది. ఈ సినిమాలో సైరాకి భార్య సిద్ధమా పాత్రలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తే... నరసింహారెడ్డి ప్రేమికురాలి పాత్రలో తమన్నా నటించింది.

అయితే తమన్నాది చిన్న రోల్ అని ముందునుంచి అందరు అనుకున్నారు. అయినప్పటికి తమన్నా సైరా ప్రమోషన్స్ లో తనని తాను బాగా హైలెట్ చేసుకోవడానికే పాల్గొంటుందని కూడా అన్నారు. కారణం తమన్నా కి ఇప్పుడు సరైన అవకాశాలు లేకపోవడమే. ఇక నయనతారని రామ్ చరణ్ బ్రతిమాలినా సైరా ప్రమోషన్స్ కి రాలేదని, మెగాస్టార్ అయితే మాత్రం ఏంటి..నాకు ఏ సినిమా అయినా ఏ హీరో అయినా ఒకటే అన్నట్టుగా నయనతార వ్యవహరిస్తోందని ప్రచారం జరిగింది. అయితే సైరా సినిమా విడుదలయ్యాక సినిమాలో నయన్ పాత్ర కన్నా తమన్నా పోషించిన లక్ష్మి పాత్ర హైలెట్ అవడమే కాదు.. నయన్ కన్నా ఎక్కువగా తమన్నా పాత్రకి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉండడం వలనే నయనతార సైరా ప్రమోషన్స్ కి రాలేదనే ప్రచారం జరుగుతుంది. తమన్నాకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి.. మెయిన్ హీరోయిన్ అయిన తనని లైట్ తీసుకోవడంపై నయన్ ఆగ్రహంగా ఉండడంతోనే చరణ్ రిక్వెస్ట్ ని కాదందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు.  

ఇక ఇదిలా ఉంటే సైరాతో పోటిగా రిలీజైన బాలీవుడ్ సినిమా వార్ అక్కడ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఇక్కడ కూడా ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ నుండి చాలా కాలానికి మాంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ రావడంతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సైరా, వార్ తో పాటు పోటీకి దిగిన జోకర్ అనే హాలీవుడ్ సినిమా ఈ రెండు సినిమాలను కలెక్షన్స్ లో వెనక్కి తోసేసింది. హాలీవుడ్ లోనే కాదు ఇండియాలోను ఈ సినిమాని ప్రేక్షకులు బాగా చూస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: