మాచో స్టార్ గోపిచంద్ హీరోగా తిరు కృష్ణమూర్తి డైరక్షన్ లో వస్తున్న సినిమా చాణక్య. స్పై థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా బరిలో ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి అంటూ వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే మెగా మూవీకి పోటీగా చాణక్య రిలీజ్ అవుతుంది. 


సైరా లాంటి పెద్ద సినిమాతో పోరాడాలంటే కష్టపడాల్సిందే.. అయితే చాణక్య సినిమా కథ, కథనాలు ప్రేక్షకులను మెప్పిస్తాయని అంటున్నాడు డైరక్టర్ తిరు. తనకు పర్సనల్ గా స్పై థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టమని చెప్పిన తిరు చాణక్య ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకుంటే కచ్చితంగా ఈ సినిమాకు సీక్వల్ గా చాణక్య 2 చేస్తామని అన్నారు.


కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లు లేక కెరియర్ లో చాలా వెనుకపడ్డ గోపిచంద్ ఈ చాణక్యతో మళ్లీ ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. పంతం తర్వాత గోపిచంద్ కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై ఈ హీరో చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ నటించింది.


చాణక్య హిట్ అయితే చాణక్య 2 తప్పకుండా తీస్తా అంటున్నాడు తిరు. ఈ సినిమా కోసం గోపిచంద్ చాలా బాగా కష్టపడ్డారని.. సినిమాలో గోపిచంద్ అదరగొట్టేస్తాడని అంచనాలు పెంచేస్తున్నాడు. చాణక్య ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించగా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. గోపిచంద్ ను తిరిగి ఫాం లోకి తెచ్చే సినిమా ఇది అవుతుందా కాదా అన్నది చూడాలి. ఈ సినిమా తర్వాత సంపత్ నంది డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు గోపిచంద్. ఆ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: