గోపిచంద్, సినిమాటోగ్రఫీ, మెహెరీన్ కౌర్ గోపిచంద్, సినిమాటోగ్రఫీ, మెహెరీన్ కౌర్ రొటీన్ స్టోరీ, మ్యూజిక్

అర్జున్ (గోపిచంద్) ఓ అండర్ కవర్ ఏజెంట్ గా పనిచేస్తుంటాడు. ఇండియాకు చెందిన రీసెర్చ్ అండ్ వింగ్ ఉడెర్ కవర్ ఏజెంట్ అయిన అర్జున్ ఓ మిషన్ కారణంగా బ్యాంక్ ఉద్యోగిగా మారుతాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ టెర్రరిస్ట్ ఖురేషిని టార్గెట్ చేస్తాడు అర్జున్. ఖురేషికి తెలియకుండానే అతనికి సంబందించిన కొందరు స్లీపర్ సెల్స్ అంతం చేస్తాడు. ఫైనల్ గా ఖురేషిని అర్జున్ ఎలా ఎదుర్కున్నాడు..? అర్జున్ స్టార్ట్ చేసిన మిషన్ ఏంటి..? అర్జున్ తను అనుకున్నది సాధించడానికి ఎంత కష్టపడ్డాడు.. కథ ఎన్ని మలుపులు తిరిగింది అన్నదే సినిమా.       

 

 

యాక్షన్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న గోపిచంద్ చాణక్య సినిమాతో మరోసారి సత్తా చాటాడని చెప్పొచ్చు. సినిమా అంతా వన్ మ్యాన్ షోగా చేశాడు. కరెక్ట్ సినిమా పడితే తన రేంజ్ ఏంటో చూపించే సత్తా ఉందని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. గోపిచంద్ యాక్షన్, ఫైట్స్, కామెడీ ఇవన్ని సినిమాకు ప్లస్ అయ్యాయి. మెహ్రీన్ కౌర్ కూడా మెప్పించింది. జరీన్ ఖాన్ ఉన్నంతలో బాగానే చేసింది. నాజర్, రాజేష్ కత్తర్ బాగానే చేశారు. ఉపెన్ పటేల్ విలంజినం పర్వాలేదు అనిపించింది. మిగతా కాస్ట్ అంతా పరిధి మేరకు నటించి మెప్పించారు.
వెట్రి సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సినిమాకు కావాల్సిన రిచ్ నెస్ కెమెరా వర్క్ లో తెలుస్తుంది. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించింది. బిజిఎం బాగుంది సాంగ్స్ అంత క్యాచీగా లేవని చెప్పొచ్చు. కథ, కథనాల్లో దర్శకుడు తిరు ప్రతిభ మెచ్చుకునేలా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. 

 

 

స్పై థ్రిల్లర్ మూవీస్ కు ఎప్పుడు క్రేజ్ ఉంటుంది. తెలుగులో వచ్చిన మరో స్పై థ్రిల్లర్ మూవీ చాణక్య. గోపిచంద్ ఎంగేజింగ్ స్క్రిప్ట్ తో ఈ సినిమా తీశాడని చెప్పొచ్చు. సినిమా కథ కొత్తగా లేకున్నా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో నడిపించాడు దర్శకుడు తిరు. ఫస్ట్ హాఫ్ బాగానే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ రేసీ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు అసలు సిసలు స్పై థ్రిల్లర్ ఇదే అనేలా ఉంటాయి.  

 

 
తిరు దర్శకత్వ ప్రతిభ మెచ్చుకునేలా ఉంది. అయితే కథనంలో ఇంకొన్ని ట్విస్టులు ఉంటే బాగుండేది. ఆడియెన్స్ ఊహించే కథ, కథనం వల్ల కొద్దిగా అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. అయితే గోపిచంద్ నటన, యాక్షన్ సీన్స్ మళ్లీ సినిమాను ట్రాక్ లో నడిపించాయి. మ్యూజిక్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. ఎడిటింగ్ కూడా ట్రిం చేసి ఉంటే బాగుండేది. 

 

 
కొద్దికాలంగా సరైన సక్సెస్ లు లేని గోపిచంద్ ఈ సినిమాతో ఫాంలోకి వచ్చినట్టే. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటుగా గోపిచంద్ మాస్ ఫ్యాన్స్ కు కావాల్సిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కథకు తగినట్టుగా కథనం.. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన చాణక్య ఈ దసరాకి పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు.

 

 

గోపిచంద్, మెహ్రీన్, జరీనా ఖాన్,తిరుగోపిచంద్ 'చాణక్య'.. చెడుపై మంచి విజయం.. అసలైన దసరా సినిమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: