జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తరువాత ఇండియా పాకిస్తాన్ ల మధ్య విద్వేషం తారా స్థాయికి చేరిపోయింది. ఇండియాను ఎదో విధంగా దెబ్బ తీయాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న నేపధ్యంలో భారతీయులు అంతా పాకిస్తాన్ పై రగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో రేపు విడుదల కాబోతున్న గోపీచంద్ ‘చాణక్య’ మూవీ ఇండో పాక్ నేపధ్యంలో సాగే స్పై థ్రిల్లర్ కథతో కూడుకున్న మూవీ అన్న లీకులు వస్తున్నాయి.

రేపు విడుదల కాబోతున్న ఈ మూవీని చూసిన సెన్సార్ సభ్యులు విపరీతంగా ప్రశంసించారు అన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ మూవీ కథకు ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న అలజడిల నేపధ్యంలో సాధారణ ప్రేక్షకులు చాల సులువుగా కనెక్ట్ అయిపోతారా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. 

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వం వహించిన ఈ మూవీ స్క్రీన్ ప్లే ఈ మూవీకి హైలెట్ గా మారుతుంది అని అంటున్నారు. దీనికితోడు ఈ మూవీ ఏమాత్రం అంచనాలు లేకుండా వస్తున్న నేపధ్యంలో ఒక మాదిరి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా గోపీ చంద్ కు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినంత క్రెడిట్ వస్తుంది. 

యాక్షన్ సీన్స్ లో గోపీచంద్ నటన చాల సహజంగా ఉంటుంది. దీనితో అతి తక్కువ పెట్టుబడితో తీసిన ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా లాభాలలోకి వెళ్ళడం ఖాయం అని అంటున్నారు. దీనికితోడు ‘సైరా’ ను ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు చూసిన పరిస్థితులలో దసరా సీజన్ లో మరో సినిమా అందుబాటులో లేని పరిస్థితులలో ఒక చేంజ్ కోసం సగటు ప్రేక్షకుడు ఈ మూవీని ఒకసారి చూసినా గోపీచంద్ కు అదృష్టం పండినట్లే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: