నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో బాబా ఒక్కడే ఒక్కమగాడిలా గేమ్ ఆడి గెలిచారు.  బాబా భాస్కర్  గెలిచినప్పటికీ కూడా  ఆయన ఆటను వేస్ట్ అంటూ హీరోని విలన్‌ని చేసి వితికానే తోపు అంటున్నారు పునర్నవి అండ్ బ్యాచ్. ఇక ఎపిసోడ్ హైలైట్స్‌లోకి వెళ్తే.. డీజే సాంగ్‌తో మొదలయితే రోజులాగే శ్రీముఖి, బాబా భాస్కర్‌లు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వారం హౌస్‌కి కెప్టెన్‌గా ఉన్న శ్రీముఖిని టార్గెట్ చేస్తూ రాహుల్ వరుణ్‌లు జోకులేసుకోవడం మొదలుపెట్టారు.బిగ్ బాస్ హౌస్‌లో లౌడ్ స్పీకర్‌గా పేరొందిన శ్రీముఖి వాయిస్‌‌ గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు ఇద్దరు.

అసలు  శ్రీముఖికి పెళ్లి అయితే తన భర్త పరిస్థితి ఏంటి? అని రాహుల్.. వరుణ్‌ని అడగడంతో ఏమో నాకేం తెలుసు. పెళ్ళి అయ్యాక అలాగే అరుస్తుందేమో.. అలాగే అరిస్తే వినిపించకుండా ఇయర్ ఫ్లగ్స్ కొనుక్కుంటాడేమో అంటూ రాహుల్ సందేహాన్ని తీర్చే ప్రయత్నం చేశారు వరుణ్. ఇక పునర్నవి నన్ను ఉదయ్యాన్నే ఎదవ అని తిట్టిడంతోనే స్టార్ట్ చేసింది ఎందుకో తెలియడం లేదని రాహుల్ అనడంతో.. ఇష్టంతో తిడుతుందన్నాడు వరుణ్.

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో  బాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవల్ 2 ప్రారంభం అయంది.  రెండో రోజు బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవల్ 2లో బాబా భాస్కర్ సింగిల్‌గా గేమ్‌ని హ్యాండిల్ చేసి దటీజ్ బాబా అనుపించుకున్నారు. రెండో రోజు బ్యాలెన్స్ ఫ్రేమ్ టాస్క్‌‌లో బాబా భాస్కర్, శివజ్యోతి, శ్రీముఖి, అలీలు పోటీదారుగా పోటీపడ్డారు. శ్రీముఖి అందరికంటే ముందే వెనుతిరగగా.. అలీ సైతం వెనుతిరిగాడు. ఫైనల్‌గా శివజ్యోతి చాలాసేపు బాబాకి మంచి ఫైట్ కూడా  ఇచ్చింది. అయితే బాబా భాస్కర్ తన డాన్స్ టాలెంట్ అండ్ బ్యాలెన్సింగ్‌తో ఒక్కసారి కూడా బ్యాలెన్స్ తప్పకుండా చివరి వరకూ నిలిచి ఫ్రేమ్ టాస్క్‌లో విజేతగా నిలిచారు.

దీంతో  బిగ్ బాస్ బాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవల్ 1‌లో విజేతగా నిలిచిన వితికాకి, బాటిల్ ఆఫ్ మెడాలియన్ లెవల్ 2 విజేతగా నిలిచిన బాబా భాస్కర్‌లలో అసలు విజేత ఎవరో తేల్చాలని ఇంటి సభ్యులకు వదిలేశారు బిగ్ బాస్. ఈ ఇద్దరిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కి బొట్టు పెట్టాలని, ఇష్టంలేని కంటెస్టెంట్‌ తలపై గుడ్డు పగల కొట్టాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఇంటి సభ్యుల్లో శ్రీముఖి, శివజ్యోతి, మహేష్ తప్ప  మిగిలిన వరుణ్, రాహుల్, అలీ, పునర్నవిలు వితికా గ్రూప్ సభ్యులే కావడంతో అందరూ అనుకున్న విదంగా వితికాను బెస్ట్ పెర్ఫామర్‌ని చేసి బాబా తలపై గుడ్డు పగలగొట్టి విలన్‌కి చేశారు. మొత్తంగా బాబా బాస్కర్ వేస్ట్ అని.. వితికా తోపు అంటూ పొగడ్తలు వర్షం కురిపించారు పున్నూ అండ్ బ్యాచ్.


మరింత సమాచారం తెలుసుకోండి: