ప్రపంచంలో ముస్లింలకు ఎంతో పవిత్రమైన దర్శన స్థలం మక్కా (మక్కా లేదా మక్కాహ్).  సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో, చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో ఉంది.  ఈనగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన మస్జిద్-అల్-హరామ్ (పవిత్ర మసీదు) గలదు. ఈ మసీదులో పవిత్రమైన కాబా గృహం గలదు. హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇక్కడికి వస్తుంటారు.. హజ్ సాంప్రదాయం లోని 'కాబా గృహం చుట్టూ ఏడు తవాఫ్ (ప్రదక్షిణ) లు  చేస్తారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కా దర్శించుకొని రావాలి అంటారు.

ఇక టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సీతాకోక చిలుక సినిమాతో బాలనటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన ఆలీ..అంచెలంచెలుగా స్టార్ కమెడియన్ గా ఎదిగారు.  కేవలం కమెడియన్ గానే కాకుండా పలు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. ఓ వైపు హీరోగా నటిస్తూ..మరోవైను స్టార్ హీరోల పక్కన స్నేహితుడిగా తనదైన వెరైటీ కామెడీ పండించారు అలీ. గత కొంత కాలంగా బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టిన అలీ పలు ఛానల్స్ లో యాంకర్, జడ్జీగా వ్యవహరిస్తున్నారు. 

ఆలీ యాంకర్ గా ‘ఆలీతో సరదాగా’ షో బాగా పాపులర్ అయ్యింది.  ఆ మద్య ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు.  ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల సందర్భంగా వైసీపీ కండువ కప్పుకొని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు పలికారు.  తాజాగా ఆలీ తన కుటుంబ సభ్యులతో ప‌ర‌మ‌ప‌విత్ర‌మైన స్థ‌లం మ‌క్కా ని దర్శించుకున్నారు. తెల్ల‌ని దుస్తుల‌లో ఆలీ, త‌న కొడుకు ఉండ‌గా కూతుళ్లు ఆయ‌న భార్య బుర్ఖా వేసుకున్నారు.ఆ ఫోటోలను అలి తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానుల కోసం పోస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: