టాలీవుడ్ లో ఆ మద్య స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి స్నేహ.  కుటుంబ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో నటించిన ఆమె ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు ఎదుర్కొనలేదు.  ఎక్సపోజింగ్ జోలికి వెళ్లకుండా చక్కని చీరకట్టుతో తెలుగు - తమిళ ఫ్యామిలీ ఆడియన్స్ ని తనవైపు తిప్పుకుంది స్నేహ.  తమిళ సినీ నటుడు ప్రసన్నను 2012లో స్నేహ ప్రేమ వివాహం చేసుకుంది. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు.

2015లో వీరికి విహాన్ అనే కుమారుడు జన్మించాడు. వాస్తవానికి స్నేహ వివాహం అయిన తర్వాత సినిమాల్లో నటించదని అందరూ భావించారు.  కానీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. హీరో గోపిచంద్ మొదటి సినిమా ‘తొలి వలపు’ మూవీతో స్నేహ కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తర్వాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, వెంకీ, సంక్రాంతి లాంటి విజయవంతమైన మూవీస్ లో నటించింది. వివాహం తర్వాత కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ... రాంచరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.

స్నేహ త్వరలో రెండోసారి తల్లి కాబోతోంది. కొన్నిరోజుల క్రితం స్నేహ తాను రెండోసారి తల్లి కాబోతున్న విషయాన్ని ఖరారు చేసింది. నేడు గర్భవతిగా ఉన్న స్నేహకు వైభవంగా సీమంతం జరిగింది. తాజాగా స్నేహ సీమంతం వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: