మెగాస్టార్ సినిమా వస్తుందంటే ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అభిమానులైతే సినిమా ఎప్పుడొస్తుందా అనే ఆతృతలో ఉంటారు. సైరా కోసం అభిమానులు చూసిన ఎదురుచూపులు ఫలించాయి. వారి ఆకలిని చిరంజీవి నటవిశ్వరూపంతో తీర్చేశాడు. సైరాతో అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే యాంటీ ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి నుంచీ సోషల్ మీడియాలో సైరాపై నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఆ వేడి తగ్గలేదంటే ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు చూసే.. అంటూ మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.

 

 


సోషల్ మీడియాలో మెగా అభిమానులు, యాంటీ ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. వీరు  చేస్తున్న ఎదురుదాడిని మెగా అభిమానులు తీవ్రస్థాయిలో తిప్పికొడుతున్నారు. సినిమా విడుదలయ్యాక మెగా అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో వారి వాదనలను తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా.. ‘చిరంజీవి 80, 90లలో మీడియాను మేనేజ్ చేసి ఫేక్ కలెక్షన్లు సృష్టించారు’ అంటూ యాంటీ ఫ్యాన్స్ మెసేజెస్ చేస్తున్నారు. దీనికి అంతే వేగంగా స్పందిస్తున్న మెగా అభిమానులు.. ’80, 90ల్లో మీడియా విస్తృతి లేదు, పైగా అప్పట్లో కలెక్షన్లు గురించి ఎవరూ చూసేవారు కారు.. సినిమా ఎన్ని రోజులు ఆడింది.. ఎన్ని సెంటర్లలో ఆడింది అని మాత్రమే చూసేవారు’ అంటూ తిప్పికొడుతున్నారు. అంతే కాదు.. వార్, చాణక్య సినిమాలను స్వచ్చందంగా ప్రమోట్ చేస్తూ ఒక్కసారిగా హృతిక్, గోపీచంద్ అభిమానులుగా మారిపోయారు యాంటీ ఫ్యాన్స్ . దీనిపై కూడా మెగా అభిమానులు తమదైన స్టైల్లో తిప్పికొడుతూ సైరా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

 

 


సోషల్ మీడియా విస్తృతి పెరిగిపోయాక అభిమానుల వార్ కొత్త టర్న్ తీసుకుంది. గతంలో సినిమాలు విడుదలయ్యాక అభిమానులు సెంటర్లు, కలెక్షన్లు గురించి వాదించుకునేవారు. ఇప్పుడు సినిమాలు విడుదల కాకముందే వాదనలు మొదలైపోతున్నాయి. ఈ ధోరణి మారాల్సిన అవసరముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: