మొన్న రిలీజ్ అయిన సైరా సినిమాకి  వస్తున్న ప్రశంస వచ్చిన పేరు అంతా ఇంతా కాదు.60 ఏళ్ల వయస్సులో చిరు చేసిన హంగామా కూడా అంతా ఇంతా కాదు అలాంటి సూపర్ హిట్ సినిమాలు చిరంజీవికి కొత్తేమి కాదు కాని సైరా మాత్రం ఒక ప్రశంస నీయమైనది,ఒక ప్రత్యేక మైనది,ఒక భావోద్వేగమైనది అంటూ అటు చిరు గాని ఇటూ చిరు అభిమానుల్లో కానీ ఎంతో గర్వించదగ్గ హిట్ కొట్టాం అనే సంతోషం మాత్రం పదిలంగా ఉండిపోయింది.

ఇదంతా బాగానే ఉంది అసలు ప్రశంస ఇప్పుడే వచ్చాయి.టాలీవుడ్ పవర్ స్టార్,జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం నిన్న సినిమా చూసాడంట సినిమా ప్రతి క్షణం ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు అని నిజం గా సైరా నరసింహారెడ్డి బతికుంటే ఇలానే ఉంటుందేమో అనెంత అందంగా,అద్భుతంగా తెర మీద చూపించారు అంటూ కొనియాడారు.  సాంకేతిక నిపుణులు చేసిన కృషికి నిజం గా సలాం కొట్టాలి అంటూ కెమెరామెన్ రత్నవేలు చేసిన  పని తీరుకు,కెమెరా అద్భుతాలు,పోరాట సన్నివేశాల్లో వాడిన ఫ్రేమ్స్ ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు అని  పవన్ కళ్యాణ్ చెప్పారు. 

భవిష్యత్తులో ఎన్నో మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ పవన్ ఇచ్చిన అభినందలనకు రత్నవేలు ఎంతో సంతోష పడ్డారు.తన కెరీర్ లో  ఇలాంటి గొప్ప ప్రసంలు వచ్చే సినిమాలు రావడం తన అదృష్టం అని పవన్ నుండి వచ్చిన ప్రశంస మాత్రం తనకు ఎంతో ప్రత్యేకమని ఎంతో భావోద్వేగం తో ట్విట్ చేశారు రత్నవేలు.ఈ సినిమాతో తెలుగు తెర మళ్ళీ కాసుల వర్షం,ఈలల మోతతో హోరెక్కించారు అభిమానులకు నిజమైన దసరా అంటే ఇదే అంటూ సంబరాల ఆకాశాన్ని అందుకుంటున్నారు చిరు అభిమానులు. సైరా చేసే అద్భుతాల కోసం ఎదురు చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: