విభిన్న పాత్రలను, సినిమాలను ఎంచుకోవడంలోమ్యాచోస్టార్‌ గోపిచంద్‌ది ప్రత్యేకమైన శైలి. ఒకవైపు రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే.. మరోవైపు కొత్త కథలతో ప్రేక్షకుల్ని మెప్పించాలన్న తపన పడే హీరో ఆయన.  లేటెస్ట్‌గా ఒక స్పై థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌'చాణక్య'తో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు.  తిరు దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అగ్ర నిర్మాత అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.  మెహ్రీన్ కౌర్ కథానాయికగా నటించగా బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. దసరా కానుకగా అక్టోబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా  గోపీచంద్ మీడియాతో ముచ్చ‌టించారు.


'చాణక్య' హైఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్‌ అవుతుంది దాని గురించి?
తప్పకుండా మీ అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్‌ అవుతుంది. నో డౌట్‌. సినిమా చాలా బాగా వచ్చింది. టీమ్‌ అంతా ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.


ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుంది?
ఫ్యామిలీస్ కోరుకునే ఎంటర్ టైన్మెంట్ సినిమాలో ఉంది. మంచి యాక్షన్ ఉంది అలాగే సినిమాలో మంచి ఎమోషన్ కూడా ఉంది. ఆ ఎమోషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.


మీరంత కాన్ఫిడెన్స్‌గా ఉండటానికి రీజన్‌?
సినిమాలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు యాక్షన్‌ ఉంది. అలాగే ఎమోషన్‌ ఉంది.  సినిమాకి వచ్చే ఆడియన్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌కి కూడా కనెక్ట్‌ అవ్వాలి. అప్పుడే ఆ సినిమా సక్సెస్‌ అవుతుంది. అలా ఈ సినిమాలో తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీతో ఆడియన్‌ సీట్‌ ఎడ్జ్‌ కూర్చుంటారు. అందుకే అంత కాన్ఫిడెంట్‌.


గోపీచంద్ అంటేనే మాస్. మరి ఈ సినిమాలో యాక్షన్ ఎంతవరకు ఉంటుంది ?
ఇది యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్. మీరు ఆశించిన్నట్లుగానే సినిమాలో యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే గుడ్ ఫన్ కూడా ఉంటుంది. ఫిల్మ్ లో లాస్ట్ సీన్ వరకూ వాట్ నెస్ట్ అనే ఒక ఇంట్రస్ట్ ఉంటుంది.


ట్రైలర్‌లో మీ లుక్‌ కొత్తగా కన్పిస్తోంది?
నేను గతంలో కూడా బియర్డ్‌ లుక్‌లో కన్పించాను. అయితే ఈ సినిమాలో లుక్‌ స్టైలిష్‌గా ఉంటుంది. లుక్‌ పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యింది. ఆ లుక్‌కి మంచి అప్లాజ్‌ వస్తోంది.


మీ గత సినిమాల కన్నా ఇందులో మోస్ట్‌ గ్లామరస్‌గా కన్పిస్తున్నారు?
నన్ను మా సినిమాటోగ్రాఫర్‌ వెట్రి అంత గ్లామర్‌గా చూపించారు. సినిమాకి ఆయన ఫొటోగ్రఫీ మంచి ఎస్సెట్‌ అవుతుంది.



ఈ జోనర్‌లో చెయ్య‌డం ఫస్ట్‌టైమ్ అనుకుంటా?
 అవునండీ. నేను ఇప్పటివరకూ స్పై థ్రిల్లర్‌, రా ఏజెంట్‌ జోనర్‌లో సినిమా చేయలేదు. అందుకే దర్శకుడు తిరు కథ చెప్పగానే వెంటనే కనెక్ట్‌ అయ్యాను. తను చాలా ఇంట్రెస్టింగ్‌గా నేరేట్‌ చేశారు. ఫస్ట్‌ నుండి చివరి వరకు ఆ ఇంట్రెస్ట్‌ అలాగే సస్టేన్‌ అయ్యింది. ఎండ్‌ కార్డ్‌ పడే వరకూ ఆడియన్స్‌కి కూడా డెఫినెట్‌గా ఆ టెన్షన్‌ రన్‌ అవుతూనే ఉంటుంది.


మీకు ఏ జోనర్‌ సినిమాలంటే ఇష్టం?
 నాకు యాక్షన్‌ మూవీస్‌ అంటే ఇష్టం. దాంతో పాటు ఈ యాక్షన్‌ మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు లవ్‌ట్రాక్‌ కలిపారు. అది ఆడియన్స్‌కి ఫ్రెష్‌ ఫీల్‌ కలిగించేలా ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: