సినిమాల్లో కథల కోసం రోజులు,వారలు, నెలలు కొంతమంది సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉంటారు.అదే ఓ స్టార్ హీరో చేయ్యాల్సిన సినిమా అంటే మరింత టైం తీసుకుంటున్నారు. కానీ ఎవడైనా ఇప్పటి వరకుమూడు గంటల్లో కథ రాశాడా? కానీ మెగాస్టార్ కోసం కథ రాసిన రోజులని గుర్తు చేసుకున్నారు ప్రముఖ రచయిత  పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్దవసూళ్ల సునామీ సృష్టిస్తుంది  ఈ క్రమంలో ప్రొడ్యూసర్ రాంచరణ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవి, రాంచరణ్, తమన్నా, జగపతిబాబు, పరుచూరి బ్రదర్స్, బుర్రా సాయిమాధవ్ తదితరులు పాల్గొన్నారు.నాకు, చిరంజీవి గారికి క్రితం జన్మలో ఏదో రుణానుబంధం ఉంది. ఓ ప్రొడ్యూసర్ వచ్చి ఒకరోజులో కథ రాయకపోతే డేట్స్ పోతాయి అని అంటే కథ రాశాం.  ఆలా .ఖైదీ రాసిన నాటి  నుంచి మా ప్రయాణం సుదీర్ఘంగా సాగింది అన్నారు.ఆ తరువాత ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్.. దొంగ టైటిల్‌తో దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ లాంటి సినిమాలు రాశాం అని చెప్పుకొచ్చారు. 

దొంగలా కాకుండా.. ఇంకా గొప్పగా రాయాలని ఇంద్ర.. ఇంద్రసేనారెడ్డి కథను రాశాం అని అలాగే నాగబాబు కోరిక మేరకు కామెడీతో బావగారు బాగున్నారా సినిమా కూడా రాశాం అని అన్నారు.ఇన్ని సినిమాల తర్వాత చరిత్రలో చిరంజీవి నిలిచిపోయేలా సినిమా తీయాలి అని రాంచరణ్‌ను రెచ్చగొట్టాలనుకొన్నాం అని పరుచూరి వెంకటేశ్వరరావు అన్నారు.అందుకే  రాంచరణ్‌ను కలిసి మీ నాన్న గొప్పవాడు కావాలంటే ఎంత ఖర్చు అయినా మీరు ఒక గొప్ప సినిమా తీయాలని అన్నాం. గాంధీ లాంటి సినిమాలైతే  కరుణరసంతో  అంతా శాంతేఉంటుంది.

కానీ ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి చిత్రంలో వీరత్వం ఉంటుంది. అందుకే ఏం కథ ఉందని అడిగితే.. ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి కథ చెప్పాం. సైరా చిత్రం చరిత్ర ఉన్నంత కాలం అందులో నిలిచిపోతుంది. చిరంజీవి, రాంచరణ్ చరితార్థులుగా మిగిలిపోతారు అని పరుచూరి వెంకటేశ్వర్ రావు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: