ప్రముఖ బాలీవుడ్ గాయకురాలు శ్రేయా ఘోషల్ తెలుగు వారికి సుపరిచితమే . ఆమె గొంతు లో ఎన్నో మధురమైన గీతాలు జీవం పోసుకున్నాయి. ఆమె పాటను ఇష్టపడని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు . ఇప్పటి వరకు నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. ఆమె నాలుగు సంవత్సరాల వయస్సు నుండే సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టింది.

 పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు "సరిగమప" అనే మ్యూజిక్ రియాలిటీ షో టైటిల్ ని గెలిచింది. శ్రేయా ఘోషల్ టాలెంట్ ను మొదట గుర్తించింది ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఆమెకు తను దర్శకత్వం వహించిన "దేవాదాస్" సినిమాలో అవకాశం ఇచ్చాడు.ఈ సినిమా లో "బారీ పియా " అనే పాట పడింది.ఈ పాటకు శ్రేయా ఘోషల్ కు జాతీయ ఉత్తమ గాయకురాలుగా అవార్డు వచ్చింది. ఆ తరువాత వరుస ఆఫర్స్ తో బిజీ గా అయ్యింది.

శ్రేయా ఘోషల్ తన చిన్ననాటి స్నేహితుడైన శిలాదిత్య ముఖోపాధ్యాయ ను 2015 లో పెళ్లి చేసుకుంది.తన భర్త పుట్టిన రోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.హ్యాపీ బర్త్ డే మై లవ్.. ఆరోగ్యంగా సంతోషంగా మరియు ప్రతీ క్షణం నవ్వుతూ ఉండాలి. మనకు వయసు పెరుగుతోంది.. కానీ, నీతో ఉంటే నేను పదహారేళ్ల అమ్మాయిలానే ఫీలవుతా.. ఈ ప్రపంచంలో నువ్వే గొప్ప భర్తవి, కొడుకువి, తమ్ముడివి, అన్నవి, స్నేహితుడివి.. లవ్ యూ సో మచ్ ' అని భర్త పై ఆమెకున్న అపారమైన ప్రేమాభిమానాలు వ్యక్తపరిచింది.
 ఒక్కడు సినిమా తో ఆమె తెలుగు సినీ ప్రయాణం మొదలైంది.7/g బృందావన్ కాలనీ,మిస్టర్ పర్ఫెక్ట్, నాయక్, వర్షం సినిమాల్లో పాటలు పడింది.ఆమె కెరియర్ లో ఇప్పటి వరకు 3600 పైగా పాటలు పాడింది. రీసెంట్ గా ఆమె సైరా నరసింహారెడ్డి లో పాడిన టైటిల్ సాంగ్ కు మంచి ఆదారణ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: