అల్లు అర్జున్ రామ్ చరణ్ ల మధ్య చిన్నపాటి గ్యాప్ ఉంది అన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. అయితే ఈ గాసిప్పుల మధ్య సంచలనాలకు చిరునామాగా ఉండే శ్రీ రెడ్డి తన కామెంట్స్ తో ఉపాసన స్నేహా రెడ్డిల మధ్య చిచ్చు పెట్టడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

ఎంతటి గొప్ప సెలెబ్రెటీలను అయినా తన సెటైర్లతో టార్గెట్ చేసే శ్రీ రెడ్డి లేటెస్ట్ గా ఉపాసనను ప్రశంసించడమే కాకుండా ఆమెను ఆకాశంలోకి ఎత్తేస్తూ ప్రశంసల వర్షం కురిపించింది. ఉపాసన ఉన్నతమైన మహిళ అంటూ ప్రశంసిస్తూ స్నేహా రెడ్డిని తీసిపారేసింది. 

ఉపాసనకు స్నేహారెడ్డికి చాలా తేడా ఉందని చెపుతూ ఉపాసన ఉన్నతమైన మహిళ అని మిగిలినవారంతా ఆమె పాదంపై దుమ్ముతో సమానమని శ్రీ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి ఆమె తన ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టింది. అయితే శ్రీ రెడ్డికి ఇలా స్నేహా రెడ్డి పై ఎందుకు అంత కోపం వచ్చిందో క్లారిటీ లేదు. ఉపాసన పై గతంలోనూ పలుమార్లు శ్రీరెడ్డి ప్రశంసల వర్షం కురిపించింది.

సేవా కార్యక్రమాలు చేస్తూ పేదవాళ్లను ఉపాసన ఆదుకుంటున్నారని గతంలో శ్రీ రెడ్డి అనేకసార్లు ప్రసంసలు కురిపించింది. అయితే ఇప్పుడు శ్రీ రెడ్డి ఇలా ఉపాసన వైపు ఎందుకు యూటర్న్ తీసుకుని ప్రశంసలు కురిపిస్తోంది అన్న విషయం క్లారిటీ లేకపోయినా ఇప్పటికే కొనసాగుతున్న చరణ్ బన్నీల సైలెంట్ వార్ కు ఇప్పుడు శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ తో వారి భార్యల మధ్య కూడ చిచ్చు పెట్టింది అనుకోవాలి. ఇప్పుడు శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ పై బన్నీ అభిమానులు కొందరు ఆమె పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. దీనికి శ్రీ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: