నయనతారకు వయసుతో పాటు గ్లామర్ కూడా పెరుగుతోంది. దాంతో పాటు ఆమె పారితోషికం కూడా ఇంకా పెరుగుతోంది. ఇక నయనతారకు డిమాండ్ మరీ మరీ పెరుగుతోంది. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా మారిన నయన్ బహుశా ఇవన్నీ చూసుకుని తన బిల్డప్ బాగా చూపిస్తోందని కామెంట్స్ ఉన్నాయి. నయన్ తీరు పట్ల టాలీవుడ్లో మొదటి నుంచి ఆక్షేపణ ఉంది. నయన్ చెప్పినట్లుగా రెమ్యునరేషన్ ఇచ్చుకున్నా కూడా ఆమె ఆ చిత్రం విషయంలో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ మెంట్ ఇవ్వరన్న కామెంట్స్ ఉన్నాయి.


ఇక నయన్ తన పాత్ర మేరకు నటించి వెళ్ళిపోవడం తప్ప ప్రమోషన్లకు హాజరు కాదు. ఆమె పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు తేడా లేకుండా ఇలగే చేస్తూ వస్తోంది. అయితే సైరా వంటి హిస్టారికల్ మూవీ, మెగాస్టార్ వంటి టాప్ హీరో పక్కన నటించిన నయన్ సైరా ప్రమోషన్లో హాజరై ఉంటే బాగుండేదన్న మాట అంతటా వినిపించింది. ఎక్కడకు వెళ్ళకపోయినా నయన్  కనీసం చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ కి వెళ్ళి ఉంటే బాగుండేదన్న మాట కూడా ఉంది.


అయితే నయన్ ఎక్కడికీ హాజరుకాలేదు. దీంతో సైరా యూనిట్ గుస్సా అయింది.  దానికి తగినట్లుగా సైరాలో రెండవ హీరోయిన్ గా నటించిన తమన్నా మాత్రం చిత్ర ప్రమోషన్లో పాలుపంచుకుని తనకు వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకున్నారు. అదే విధంగా ఆమె దేశవ్యాప్తంగా సైరా యూనిట్ తో పాటే తిరిగి తన ఇమేజ్ రెట్టింపు చేసుకున్నారు.


ఇక సైరా మూవీలో తమన్నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. నరసింహారెడ్డి ప్రియురాలి పాత్రలో లక్ష్మిగా ఆమె నటనా అదుర్స్ అంటున్నారు. ఓ విధంగా మెయిన్ లీడ్ హీరోయిన్ నయన్ తేలిపోయిందని, తమన్నాకే ఎక్కువ ఆదరణ దక్కిందని రిపోర్టులు వస్తున్నాయి. ఈ పరిణామాలతో నయన్ కి షాక్ తగిలినట్లేనని అంటున్నారు. ఏది ఏమైనా అతి చేసిన నయన్ అతిశయం సైరా సినిమా రూపంలో షాక్ కొట్టేలా చేసిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: